Begin typing your search above and press return to search.

రెజీనా కోసం దేవుళ్ళ సాయం

By:  Tupaki Desk   |   22 April 2017 4:29 PM GMT
రెజీనా కోసం దేవుళ్ళ సాయం
X
టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రాకు అన్నీ ఉన్నా కాలం ఒక్కటీ కలిసి రాలేదు. అందం.. ఆకర్షణ.. అభినయం.. అన్నీ ఉన్నా అమ్మడికి టైం మాత్రం కలిసి రాలేదు. ప్రస్తుత యంగ్ జనరేషన్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవుతుందని ముందుగా అంచనాలు ఏర్పరచుకున్న రెజీనా.. ఆ తర్వాత రేసులో వెనకబడిపోయింది.

ఇప్పుడీ భామకు కోలీవుడ్ లో కొన్ని అవకాశాలు ఉన్నా.. తెలుగులో మాత్రం అవసాన దశకు చేరుకున్న పరిస్థితి. చేతిలో ఉన్న నక్షత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో దర్శకుడు కృష్ణవంశీ కూడా చెప్పలేకపోతున్నాడు. ఇలాంటి సమయంలో 'హరే రామ హరే కృష్ణ' అనే మూవీకి సైన్ చేసింది రెజీనా. కొత్త హీరోతో కొత్త దర్శకుడు రూపొందించే ఈ మూవీకి సెంట్రాఫ్ అట్రాక్షన్ రెజీనానే. అర్జున్ సాయి అనే నూతన దర్శకుడు హరే రామ హరే కృష్ణ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. దిలీప్ ప్రకాష్ అనే కుర్రాడితో రెజీనా రొమాన్స్ చేయనుంది.

రొమాంటిక్ కామెడీ జోనర్ లో రూపొందే ఈ మూవీలో.. హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ పాత్రలో రెజీనా కసాండ్రా కనిపించనుందట. పూర్తిగా సాంప్రదాయాల ప్రకారం.. అంటే సినిమా టైటిల్ కి తగినట్లుగా ఉండే రోల్ ఈమెది. మరి ఇంత మంది హీరోలు ఇవ్వలేకపోయిన అదృష్టాన్ని.. రాముడు-కృష్ణుడులో ఏ దేవుడు అందిస్తాడో చూడాలి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/