Begin typing your search above and press return to search.

జ్యో అచ్యుతానంద‌.. 90 ఏళ్లొచ్చినా మ‌రిచిపోను

By:  Tupaki Desk   |   27 Aug 2016 3:30 AM GMT
జ్యో అచ్యుతానంద‌.. 90 ఏళ్లొచ్చినా మ‌రిచిపోను
X
త‌న‌కు 90 ఏళ్ల వ‌య‌సొచ్చినా ‘జ్యో అచ్యుతానంద’ సినిమాను మ‌రిచిపోన‌ని అంటోంది రెజీనా. అంత‌గా త‌న‌కీ సినిమా న‌చ్చేసింద‌ని ఆమె చెప్పింది. ‘‘జ్యో అచ్యుతానందలో నేను డెంటల్ డాక్టర్ పాత్ర పోషించా. ప‌క్కింటి అమ్మాయిలా ఉంటాను. ఈ సినిమాలో నన్ను చూసినవాళ్లు నవ్వుతారు.. బాధపడతారు.. ఇష్టపడతారు.. అసహ్యించుకుంటారు కూడా. ఇంత మంచి పాత్ర చేసే అవకాశం రావ‌డం నా అదృష్టం. ఇందుకు అవ‌స‌రాల శ్రీనివాస్.. సాయి కొర్రపాటిల‌కు కృతజ్ఞతలు. నాకు 90 ఏళ్లు వచ్చినా కూడా నేనీ సినిమాను మర్చిపోను. నా మనవలు.. మనవరాళ్లకు కూడా ఈ సినిమా చూడమని చెబుతాను అంతగా నా మనసుకు దగ్గరయిందీ సినిమా. ఈ కథ విన్నప్పట్నుంచి ఎప్పుడెప్పుడు షూటింగ్ ఆరంభమవుతుందా అని ఎదురు చూశా. ఇప్పుడు సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా అని ఎదురు చూస్తున్నా’’ అని రెజీనా చెప్పింది.

తాను చేస్తున్న‌.. చేయ‌బోతున్న సినిమాల గురించి చెబుతూ.. ‘‘ప్రస్తుతం హిందీ చిత్రం ‘ఆంఖే-2’లో నటిస్తున్నా. అమితాబ్ గారితో పాటు భారీ తారాగణం ఈ చిత్రంలో ఉంటుంది. ఈ మధ్యే ఫోటోషూట్ జరిగింది. ఇప్పటివరకూ అలాంటి భారీ ఫొటోషూట్‌లో నేను పాల్గొనలేదు. ఇది కాకుండా తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. తెలుగులో ‘జ్యో అచ్యుతానంద’తో పాటు ‘శంకర’ కూడా ఒకే నెల‌లో విడుద‌ల‌వుతాయి’’ అని రెజీనా తెలిపింది. సాయిధ‌ర‌మ్ తేజ్ కు.. త‌న‌కు లింకు క‌లుపుతూ వ‌చ్చే వార్త‌ల గురించి స్పందిస్తూ.. ‘‘మీకు సాయిధరమ్ తేజ్‌కు బ్రేకప్ అయ్యిందా అని అడుగుతుంటారు. మా ఇద్దరి మధ్య ఏదో ఉందని రాస్తారు. ఆ తర్వాత బ్రేకప్ అంటారు. నా ప‌నైపోయింద‌ని.. సినిమాల్లేవ‌ని కూడా రాస్తుంటారు. ఇలాంటివి చ‌దివితే బాధేస్తుంది’’ అని రెజీనా చెప్పింది.