Begin typing your search above and press return to search.

రెజీనా... నీ బాధేంట‌మ్మా!?

By:  Tupaki Desk   |   23 March 2018 5:30 PM GMT
రెజీనా... నీ బాధేంట‌మ్మా!?
X
రెజీనా క‌సాండ్రా... అన్నీ ఉన్నా అదృష్టం లేని హీరోయిన్‌. స్టార్ హీరోయిన్‌ కి కావ‌ల్సిన అందం - అభిన‌యం ఉన్నా, ఎందుకో అమ్మ‌డికి అవ‌కాశాలు మాత్రం ఆ స్థాయిలో రాలేదు. అప్పుడెప్పుడో 2012లో సుధీర్‌ బాబు హీరోగా ప‌రిచ‌యం చేస్తూ వ‌చ్చిన ‘SMS’ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది రెజీనా - అంత‌కు ముందే త‌మిళంలో మూడు సినిమాలు చేసింది.

తెలుగులో ‘రోటీన్ ల‌వ్‌ స్టోరీ’ - ‘కొత్త జంట‌’ - ‘సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌’ - ‘ప‌వ‌ర్‌’ వంటి ప‌లు చిత్రాల్లో న‌టించినా క్రేజ్ మాత్రం రాలేదు. తాజాగా నాని నిర్మించిన విభిన్న క‌థా చిత్రం ‘అ!’లో ఓ డిఫ‌రెంట్ రోల్ చేసింది రెజీనా. వంటి నిండా టాటూలు పొడిపించుకుని - స‌రికొత్త హెయిర్ స్టైల్‌ తో చూడ‌డానికి కూడా కొత్త‌గా అనిపించింది. సినిమాల్లోకి వ‌చ్చి ద‌శాబ్దం దాటిన సంద‌ర్భంగా ఆమె ఓ ఛాన‌ల్‌ కి ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె తెలుగులో ఎస్ ఎంఎస్ సినిమా చేయ‌క‌ముందే - సినిమ‌ల్లో ఉండాల‌నే ఆలోచ‌నే లేద‌ని చెప్పింది. ఆ సినిమా త‌ర్వాతే కెరియ‌ర్ గురించి ఆలోచించాన‌ని చెప్పుకొచ్చింది. సైకాల‌జీలో డిగ్రీ చేయాల‌ని - హ్యుమ‌న్ బిహేవిర్‌ - థియేట‌ర్ అండ్ డ్యాన్స్‌లో కెరియ‌ర్‌ ను ఎంచుకోవాల‌ని భావించిందట‌. డిగ్రీ పూర్త‌య్యేదాకా సినిమాలు చేయాల‌ని - త‌ర్వాత ఆపేద్దామ‌ని అనుకుంద‌ట‌. కానీ వ‌రుస అవ‌కాశాలు రావ‌డంతో సినిమాల్లో కెరియ‌ర్‌ ని వెతుక్కున్నానంటూ చెప్పుకొచ్చింది రెజీనా.

అన్నింటికీ మించి ‘నేను తెర వెన‌క ఎన్ని బాధ‌ల్లో ఉన్నా - తెర మీద‌కి వ‌చ్చేసరికి న‌వ్వాల్సి ఉంటుంది. న‌ట‌న‌లో మాత్రమే ఉండే ఈ అవ‌కాశం - ఇంకెక్క‌డా క‌నిపించ‌దు’ అంటూ ఫిలాస‌ఫీ చెప్పుకొచ్చింది రెజీనా. అవ‌కాశాల కోసం అతిగా ఆశ‌లు పెట్టుకున్న అమ్మ‌డికి ఈ మాత్రం ఫిలాస‌ఫీ వొంట‌బ‌ట్ట‌డం మామూలే అనుకుంటున్నారు సినీ జ‌నాలు.