Begin typing your search above and press return to search.

రెజీనా ప్రేమించింది ఎవ‌ర్ని?!

By:  Tupaki Desk   |   31 July 2015 5:01 AM GMT
రెజీనా ప్రేమించింది ఎవ‌ర్ని?!
X
వ‌రుస‌గా మెగా హీరోల‌తో జోడీ క‌డుతూ మెగా హీరోయిన్‌ గా పేరు తెచ్చుకొంది రెజీనా. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్‌ తో క‌లిసి `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌` చిత్రంలో న‌టిస్తోంది. కొత్త‌గా గోపీచంద్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టింద‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రోప‌క్క త‌మిళంలోనూ జోరుమీదున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ప్రేమ‌క‌బుర్లు చెప్పింది. రెండున్న‌రేళ్ల క్రితం నేను ఒక‌రితో సీరియ‌స్ రిలేష‌న్ షిప్‌ లో ఉన్నా సెల‌విచ్చింది. ఆ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీ లో హాట్‌ టాపిక్‌ గా మారింది. రెజీనా ప్రేమించింది ఎవ‌ర్ని? అంటూ ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు. తెలుగులో అయితే రెండున్న‌రేళ్ల క్రితం సందీప్‌ కిష‌న్‌, అల్లు శిరీష్‌ లాంటి క‌థానాయ‌కుల‌తో రొటీన్ ల‌వ్ స్టోరీ, కొత్త‌జంట సినిమాలు చేసింది. రెజీనా ఒక‌వేళ క‌థానాయ‌కుల‌తోనే ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపిందంటే వాళ్లిద్ద‌రిపైనే డౌట్ వ్య‌క్తం చేయొచ్చు. మ‌రి ఆమె ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన‌వాళ్ల‌తో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపిందా, బ‌య‌ట వ్య‌క్తుల‌తోనా అన్న‌ది తేలాల్సి వుంది.

అన్న‌ట్టు రెజీనా ప్రేమ‌లో ప‌డ‌టం ఇప్పుడు కొత్తేమీ కాద‌ట‌. చిన్న‌ప్పుడే పొరుగింటి అబ్బాయితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపింద‌ట‌. ``అయినా అప్ప‌ట్లో జ‌రిగిన వ్యవ‌హారాల్ని ప్రేమ అన‌కూడ‌దు లెండి. అదొక ఆక‌ర్ష‌ణ అంతే`` అంటోంది రెజీనా. మ‌రి ఇప్పుడేంటి అంటే... ``ఇప్పుడు సింగిల్‌. రెండున్న‌రేళ్ల క్రితం సీరియ‌స్‌ గా ప్రేమించాను. కానీ ఆ త‌ర్వాత మా మ‌ధ్య బంధం కొన‌సాగ‌లేక‌పోయింది. అందుకే విడిపోయాం. ఇప్పుడు ప‌నిని మాత్ర‌మే ప్రేమిస్తున్నా`` అని చెప్పుకొచ్చింది.