Begin typing your search above and press return to search.

రెజీనా ఏం చేసినా వర్కవుట్ కావట్లే

By:  Tupaki Desk   |   29 May 2016 6:51 AM GMT
రెజీనా ఏం చేసినా వర్కవుట్ కావట్లే
X
డస్కీ హీరయిన్‌ రెజీనా లో యాక్టింగ్ టాలెంట్‌ పుష్కళంగా ఉంది. కాని ఇప్పుడు అమ్మడికి టాలీవుడ్‌ లో పెద్దగా అవకాశాలు అనేవే లేవు. ఎంత ప్రయత్నించినా కూడా చిన్న చిన్న హీరోలే తప్పించి.. పెద్ద స్టార్లు అమ్మడికి బ్రేక్‌ ఇవ్వట్లేదు. కారణం ఏమైయుంటుంది అంటారు?

నిజానికి సాయిధరమ్‌ తేజ్‌ తో రెండు సినిమాలు చేశాక.. అమ్మడికి వెంటనే మెగా క్యాంప్ లో రెడ్‌ కార్పెట్‌ వేస్తారని అనుకుంటే.. ఇంతవరకు అక్కడ ఒక్క ఛాన్సు కూడా రాలేదు. ఆ తరువాత బన్నీతో ఓ.ఎల్.ఎక్స్ యాడ్ తప్పిస్తే ఏదీ చేయలేదు రెజీనా. ప్రస్తుతం ఇద్దరి హీరోలతో జో అచ్చుతానంద.. అలాగే కృష్ణవంశీ నక్షత్రం సినిమా చేస్తోంది అమ్మడు. అయినా కూడా.. క్యారెక్టర్‌ నచ్చితే రెమ్యూనరేషన్ ది ఏముంది.. అంటూ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉంది. అయినాసరే పెద్ద స్టార్ల దగ్గర నుండి పిలుపు రావట్లేదు.

బహుశా రెజీనా తమను డామినేట్‌ చేస్తుందని అందరూ ఫీలవుతున్నారు కాబోలు. అందుకే ఇలా ఆమెను పక్కనెట్టేస్తున్నారనేది ఫిలిం నగర్‌ టాక్‌. పోనివ్‌ అలా చూసుకున్నా.. ఆమె హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలైనా రావాలిగా.. అదీ రావట్లేదు మరి.