Begin typing your search above and press return to search.

సౌఖ్యంగా హాట్‌ డోస్‌ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   25 Nov 2015 7:15 PM GMT
సౌఖ్యంగా హాట్‌ డోస్‌ ఇచ్చేశారు
X
కేవలం ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ గురించి డేట్‌ ఒక్కటే ఫిక్సయ్యింది.. ఆ లెక్కన చూస్తే ఆడియో రిలీజ్‌ అయ్యకా ఈ ప్రమోషన్ల హడావుడి అదీ మొదలవ్వాలి. మామూలుగా అదే ఆనవాయితి. కాని సౌఖ్యం విషయంలో మాత్రం కుర్రాళ్ళు అప్పుడే రచ్చ మొదలెట్టేశారు.

హాట్‌హాట్‌ ప్రమోషన్లు మాత్రం చేసేస్తున్నారు సౌఖ్యం టీమ్‌. యగ్ఞం సినిమాను తీసిన ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి డైరక్షన్‌ లో ఇప్పుడు యాక్షన్‌ హీరో గోపిచంద్‌ మరోసారి సినిమా చేస్తున్నాడు. టైటిల్‌ సౌఖ్యం.. సినిమా ఆడియో డిసెంబర్‌ 13న రిలీజ్‌ అవుతోంది. అదేమో కాది.. ఇప్పటినుండే హీరోయిన్‌ రెజీనా అండ్‌ సెక్సీబాంబ్‌ శ్వేతా భరద్వాజ్‌ సినిమాను తెగ ప్రమోట్‌ చేసేస్తున్నారు.

ఆల్రెడీ షూటింగ్‌ స్పాట్‌ నుండి తన ఐటెం సాంగ్‌ ఎలా వస్తుందో చెప్పడానికి బ్యాడ్‌ బాయ్స్‌ కావాలంటే శ్వేత తెగ ఊరించేసింది. ఇకపోతే సినిమాను మరో ఈవెంట్‌ లో ప్రమోట్‌ చేసిన రెజీనా కూడా తన హాట్‌ అందాలతో పిచ్చెత్తించింది. సౌఖ్యంగా అందాలు హోరుతో ఇద్దరూ సినిమాకు బాగానే హైప్‌ తెచ్చారులే. ఈ హాట్‌ డోస్‌ తో సినిమాను మరి ఏ రేంజులోకి తీసుకెళ్తారోలే!!