రెజీనాకు అదొక్కటే ఆఫరా???

Thu Apr 20 2017 17:51:11 GMT+0530 (IST)

యాక్టింగ్ టాలెంట్ కావల్సినంత ఉంది. చూడ్డానికి డస్కీగా చాలా గమ్మత్తయిన అందాలతో మత్తెక్కిస్తుంది. అందాల ఆరబోతకు కూడా సై అనే చెప్పింది. కాని తెలుగు ఫిలిం ఇండస్ర్టీలో ఆఫర్లు మాత్రం వచ్చి వాలట్లేదు. అందుకే ఇప్పుడు రెజీనా కసాండ్రా.. సైలెంటుగా తనకు వచ్చిన సినిమా ఛాన్సులనే ఒప్పుకుంటోంది. కాకపోత మరీ ఇలాంటి చిన్న చిన్న ఆఫర్లా అంటూ జనాలు షాకైపోతున్నారంతే.

కొత్త కుర్రాడు అర్జున్ సాయి డైరక్షన్లో.. ఇప్పుడు ఒక సినిమా వస్తోంది. ఇందులో ఒక కొత్త పిల్లాడు దిలీప్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా చేయమని ఎప్రోచ్ కావడంతో వెంటనే ఒప్పేసుకుందట రెజీనా. రేపే ఈ సినిమా ముహూర్తం అంటున్నారు. అయితే ఇప్పటివరకు స్టార్ హీరోలతో సినిమా చేసి ఏదన్నా పెద్ద రేంజుకు వెళ్తుందేమో అనుకుంటే.. ఇప్పుడేమో ఇలా కొత్త కొత్త కుర్రాళ్ళతో సినిమాలు చేయడానికి రెజీనా సిద్దపడుతోందంటే.. ఆఫర్లు లేకనే అనుకోవాలా మరి?

నిజానికి రెజీనా విషయంలో ఎక్కడో చిన్న పొరపాటు జరిగిందనే అనుకోవాలి. అసలు అంతటి యాక్టింగ్ టాలెంట్ ఉన్న అమ్మాయి.. సమంత తరహాలో బిజీ అయిపోవాలి కాని.. ఎందుకో వెనుకపడిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/