Begin typing your search above and press return to search.

విడాకులు ఇచ్చేశానని రాసుకోండి -రెజీనా

By:  Tupaki Desk   |   27 Aug 2016 3:30 PM GMT
విడాకులు ఇచ్చేశానని రాసుకోండి -రెజీనా
X
ఓ రెండు రోజుల క్రితం మీడియాకు ప్రత్యేక ఇంటర్యూలు ఇచ్చిన రెజీనా కసాండ్రా.. ఆ సందర్బంగా తన మీద వస్తున్న రూమర్లపై కాస్త కరుగ్గానే స్పందించట. ఆఫ్‌ ది రికార్డు కామెంట్లు చేసిన ఈ అమ్మడు.. అసలు లింకప్ రూమర్లపై ఏమని స్పందించిందో తెలుసా?

''మొన్నటివరకు సాయిధరమ్ తేజ్ తో లవ్ ఎఫైర్ అన్నారు. తరువాత బ్రేకప్ అయిపోయింది అంటున్నారు. సినిమాలు రావట్లేదు కాబట్టే బికినీ వేస్తోంది అన్నారు. ఇప్పుడేమో ఇంకేదో చెబుతున్నారు. పోనివ్ సాయిధరమ్ తేజ్ తో డైవర్స్ అయిపోయిందని రాసుకోండి'' అంటూ కాస్త కోపంగా స్పందించిందట రెజీనా. అమ్మడు మామూలుగా చాలా కంపోజుడ్ గానే ఉంటుంది కాని.. రూమర్లు మరీ మితిమీరిపోయి రావడంతో ఇలా ఘాటుగా సమాధానం చెప్పుంటుందిలే. అందుకే మీడియా వారు ఈ ఘాటు సమాధానాలను ఎక్కడా కవర్ చేసిందేలేదు.

అయితే రెజీనా ఈ రేంజులో టాప్ లేపే ఆన్సర్లు ఇవ్వడానికి కారణం.. ప్రస్తుతం ఆమె చేతినిండి ఫుల్లుగా ప్రాజెక్టులు ఉండడమే అనే వారూ లేకపోలేదు. తెలుగులో జో అచ్యుతానంద తరువాత నక్షత్రం - ఆ తరువాత మంచు మనోజ్ సినిమా.. ఇలా లైనప్ బాగుంది. తమిళంలో కూడా ఓ రెండు సినిమాలున్నాయి. దానితో అమ్మడు ఇలా సీరియస్ అయ్యుంటుందేమో అనేది కొందరి ఫీలింగ్.