Begin typing your search above and press return to search.

ప్రేమలో పడ్డాకే ఆఫర్లు తగ్గాయట

By:  Tupaki Desk   |   16 Jan 2018 3:18 PM GMT
ప్రేమలో పడ్డాకే ఆఫర్లు తగ్గాయట
X
హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకు ఇండస్ట్రీలో ఉండగలిగే టైం ఒకరకంగా తక్కువ అనే చెప్పచు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు హీరోయిన్లు అందరు ఇండస్ట్రీ లో స్టార్ స్టేటస్ ఉన్నపుడే వీలైనన్ని సినిమా ఆఫర్లను తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఒక్కసారి కెరీర్ లో ఆటుపోట్లు వస్తే వారి కెరీర్ మొత్తం దెబ్బతినే పరిస్థితులు రావచ్చు.

రెజినా కసాండ్రాకు కూడా ఇలానే జరిగింది అట. వచ్చిన మొదట్లో బోలెడన్ని హిట్ సినిమాల్లో నటించినప్పటికీ ఈ 'రొటీన్ లవ్ స్టోరీ' చిన్నది తన స్టార్ స్టేటస్ ను ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయింది. "నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను హీరోయిన్ అవ్వాలని కలలు కనేదాన్ని. కానీ నా 10 ఏళ్ళ సినిమా జర్నీ లో నేను ప్రేమలో పడి తప్పు చేశాను" అంటూ తనకు ఆఫర్లు తగ్గిపోవడాయికి గల కారణంకూడా చెప్పుకొచ్చింది. ఇంత చెప్పింది కానీ ఎవర్ని ప్రేమించి తప్పు చేసారు అని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదు. కానీ అందరి హీరోయిన్లకి లాగానే ఈమెకు కూడా గతం లో సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ వంటి వారితో ప్రేమాయణం సాగించినట్టు రూమర్లు ఉన్నాయ్ కానీ వాటిల్లో నిజ నిజాలు మాత్రం ఎవరికి తెలీదు సుమా.

ఏదేమైనా.. ఆఫర్లు తగ్గిపోవడానికి గల కారణాలు తెలుసుకోగల హీరోయిన్లు ఉంటారేమో కానీ వాటిని మళ్ళీ తిరిగి పొందేవారి సంఖ్య మాత్రం తక్కువనే చెప్పచు. తనతో పాటే వచ్చినా ఇప్పటికి స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న హీరోయిన్లు ఉన్నారు కానీ రెజినా మాత్రం పాపం ఇలా అయిపోయింది. అయినాసరే ఏ మాత్రం భయపడకుండా తన కెరీర్ ను చాలా జాగ్రత్త ప్లాన్ చేసుకుంటోంది రెజినా. 'నక్షత్రం'లో తన గ్లామర్ తో అలరించి.. ఇప్పుడు 'ఆ!' సినిమాతో రాబోతోంది.