Begin typing your search above and press return to search.

రెజీనాకి 150వ సినిమా దారి దొరికింది

By:  Tupaki Desk   |   4 Oct 2015 11:30 AM GMT
రెజీనాకి 150వ సినిమా దారి దొరికింది
X
రెజీన రోజు రోజుకి స్టెప్ బై స్టెప్ ఎదుగుతోంది. తెలివైన ప్ర‌ణాళిక‌ల‌తో మెగా అండ‌దండ‌ల‌తో స్టార్‌ డ‌మ్‌ ని పెంచుకుంటోంది. అందం ఉంది. అభిన‌యం ఉంది. వాటికి మ‌రింత మెరుగులు దిద్దుకుంటూ డ్యాన్సింగ్ స్కిల్స్‌ ని పెంచుకుంటూ నెమ్మ‌దిగా రేసులోకి దూసుకెళ్తోంది. ఇప్ప‌టికి ఓ స్టెబిలిటీ క‌నిపిస్తోంది. లుక్స్ ప‌రంగా - డ్యాన్సుల పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యింది. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రంలో రెజీన క‌నిపించిన తీరు యూత్‌ లో డిష్క‌స‌న్ పాయంట్ అయ్యింది. ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు వ‌చ్చేలా మేనేజ్ చేసేసింది రెజీన‌.

మొత్తానికి ఇండస్ర్టీలో ఈ అమ్మ‌డి గురించిన డిష్క‌స‌న్ జ‌రుగుతోంది. ఇది త‌న‌కి పెద్ద ప్ల‌స్. అంతే కాదు మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా క‌త్తి రీమేక్ అని ప్ర‌చారం సాగుతున్న ఈ సంద‌ర్భంలో అందులో హీరో పాత్రకి పెయిర్‌ గా ఎవ‌రు స‌రిపోతారు? అన్న డిష్క‌స‌న్ కూడా సాగుతోంది. కొంద‌రైతే మొన్ననే సాయిధరమ్‌ సరసన గువ్వా గోరింకతో పాటలో నటించిన రెజీనా అచ్చం చిరంజీవి హీరోయిన్‌ లాగానే కనిపించిందని.. అందుకే ఆమె అయితే చిరంజీవి సరసన కరక్ట్‌ అంటున్నారు. సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ సినిమాలో అమ్మడి కమర్షియల్‌ యాంగిల్‌ చూశాక ఇలాంటి కిక్‌ వస్తోంది జనాలకు. మరి అమ్మడిని 150వ సినిమాకి హీరోయిన్‌ గా తీసుకుంటే ఎలా ఉంటుంది? కత్తి ఒరిజినల్‌ లో సమంత మెరిసినట్లు.. రెజీనా కూడా మెరుస్తుందా? లేదంటే చిరంజీవి సరసన మరీ యంగ్‌ గా కనిపిస్తుందని పక్కనెట్టేస్తారా? లెటజ్‌ సీ.