Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రెజీనా ఇలా అయ్యిందేంటి?

By:  Tupaki Desk   |   13 Dec 2017 11:48 AM GMT
ఫోటో స్టోరి: రెజీనా ఇలా అయ్యిందేంటి?
X
కొంత మంది హీరోయిన్స్ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఎంత అందంగా ఉన్నా కూడా అనుకున్నంతగా క్రేజ్ ను అందుకోలేరు. ఇక మరికొంత మంది సినిమాల్లో ఎంత కష్టపడినా కూడా హిట్ అందుకోలేరు. కానీ కష్టపడితే ఎదో ఒక చోట మంచి గుర్తింపు దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే.. ముందుగా నటీనటులు ఎలా నటించారు అనేదే మెయిన్ పాయింట్. నటనలో గుర్తింపు తెచ్చుకుంటే కెరీర్ ను మంచి ట్రాక్ లో పెట్టుకోవచ్చు.

ఇప్పుడు అదే తరహాలో డస్కీ బ్యూటీ రెజీనా కాసాండ్రా కూడా అలానే ప్రయత్నాలు చేస్తోంది. అమ్మడిని గత కొంత కాలంగా అపజయాలు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నా కూడా నటనతో అలాగే గ్లామర్ షోతో అభిమానులను చాలా ఆకట్టుకుంటోంది. ఇక అసలు విషయానికి వస్తే రెజీనా అప్పుడపుడు కొన్ని గ్లామర్ ఫొటో షూట్స్ తో కనిపిస్తూ ఉంటుంది. ఆ విషయం అందరికి తెలిసిందే. కానీ రీసెంట్ గా ఆమెకు సంబందించిన ఒక ఫొటోను చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

ఫ్యాషన్ ప్రపంచంలో ఘాటైన బ్యాడ్ యాస్ అనే లేడీస్ ఎలా ఉంటారో అలాంటి లుక్ ని కొంచెం చూపించి భారీ అంచనాలను రేపింది. ఒక గోడపై చేతులు పెట్టిన రెజీనా తన ఘాటైన స్టైలిష్ లుక్ తో నిజంగా మైండ్ బ్లక్ చేసిందనే చెప్పాలి. కుడి చేతిపై ఒక పాములాంటి టాటూ ను వేసుకొని ఇక హెయిర్ స్టైల్ ని చాలా కొత్తగా చూపించింది. అంతే కాకుండా తన అందమైన వీపు పై ఒక ఆర్ట్ ఉండడంతో అమ్మడు ఎదో ప్రయోగమే చేయబోతోందని అందరు అనుకుంటున్నారు.

ఇంతకీ ఇది ఫొటో షూట్ అని అనుకుంటే అబద్దమే అవుతుంది. ఎందుకంటే నాని ప్రొడక్షన్ లో తెరకెక్కుతోన్న అ! సినిమా కోసం అమ్మడు ఇలా రెడీ అయ్యింది. ఆ సినిమాలో కాజల్ - నిత్యామీనన్ వంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. వారితో పాటు రెజీనా కూడా చాలా కొత్తగా కనిపించనుందని తెలుస్తోంది. మొన్నటి వరకు గ్లామర్ అందాలతో రెచ్చిపోయిన ఈ బ్యూటీ ఇప్పుడు కొంచెం డిఫెరెంట్ గా ఆకట్టుకోవాలని చూస్తున్నట్టు ఉంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.