Begin typing your search above and press return to search.

రెజీనా ఇంకా ట్రై చేస్తోందిగా!!

By:  Tupaki Desk   |   28 May 2017 7:24 AM GMT
రెజీనా ఇంకా ట్రై చేస్తోందిగా!!
X
కాజల్.. త్రిష లాంటి స్టార్ హీరోయిన్స్ వరుసగా ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న తరుణంలో క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ రెజీనా కసాండ్రా. నెక్ట్స్ జనరేషన్ కి స్టార్ హీరోయిన్ అవుతుందని మొదటగా అనిపించుకున్న భామ కూడా రెజీనానే. కానీ ఇండస్ట్రీ జనాల అంచనాలు బెడిసికొట్టి.. ఇంకా అవకాశాల కోసం పాకులాడాల్సిన పరిస్థితిలోనే ఉండిపోయింది ఈ భామ.

తెలుగు ఆడియన్స్ కి వారానికో కొత్తమ్మాయిని చూసే అవకాశం ఉండడంతో.. ట్యాలెంట్ ను గుర్తించడం లేదు.. పట్టించుకోవడం లేదంటూ ఈ మధ్య టాలీవుడ్ ఆడియన్స్ మీద దారుణమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. తమిళ్ లో 2-3 ఛాన్స్ లు రాగానే ఇలా చెప్పిందిలే. అయితే.. అక్కడ కూడా ఏమంత సాఫ్ట్ లాంఛ్ దొరక్కపోవడంతో.. అవకాశాల కోసం ఫోటో షూట్స్ బాట పట్టింది రెజీనా. తన మేని అందాల మెరుపులతో తాజాగా ఓ ఫోటో షూట్ కూడా చేసేసింది. క్లీవేజ్ అందాలను చూపిస్తూ.. నిఖార్సైన అందగత్తెగా తన సొగసులను బాగానే ఎగ్జిబిట్ చేసింది.

చేతులు కట్టుకుని బుద్ధిగా కనిపిస్తోంది కానీ.. సరైన ఛాన్స్ దొరికితే మాత్రం తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకుని మళ్లీ ఫామ్ లోకి వచ్చేసేందుకు సిద్ధంగా ఉన్న రెజీనాకు.. త్వరలో రిలీజ్ కానున్న నక్షత్రం మూవీ సక్సెస్ కావడం చాలా ముఖ్యం. రామ్ చరణ్ తో గోవిందుడు చిత్రం తర్వాత కృష్ణవంశీ తీస్తున్న మూవీ కావడంతో నక్షత్రంపై ఎక్స్ పెక్టేషన్స్ కూడా బాగానే ఉన్నాయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/