Begin typing your search above and press return to search.

మళ్లీ రెజీనాను దించుతున్నాడా?

By:  Tupaki Desk   |   2 May 2016 7:56 AM GMT
మళ్లీ రెజీనాను దించుతున్నాడా?
X
అప్పట్లో హీరో సందీప్‌ కిషన్‌ అండ్‌ డస్కీ సోయగం రెజీనాల గురించి ఒక టాక్‌ ఉండేది. ఏదేమైనా ఇద్దరూ మాంచి ఫ్రెండ్స్‌. ''రొటీన్‌ లవ్‌ స్టోరీ'' సినిమాతో ఆమెను ఒక కమర్షియల్‌ హీరోయిన్‌ గా లైన్లోకి తెచ్చింది సందీప్‌ అనే చెప్పాలి. ఆ తరువాత అమ్మడు హాటు హాటుగా మనోడికి ''రారా కృష్ణయ్యా'' అనే సినిమా చేసింది కాని.. అది అట్టర్‌ ఫ్లాప్‌ కి బాప్‌. తరువాత రెజీనా 'మెగా' ప్రయాణం గురించి తెలిసిందే.

ఇకపోతే రెజీనా చేతిలో ఇప్పుడు ''జో అచ్యుతానంద'' తప్పిస్తే మరో పెద్ద ప్రాజెక్టేం లేదు. ఇక సందీప్‌ మాత్రం ఎన్నిఫ్లాపులు వచ్చినా కూడా వరుసగా డిఫరెంట్‌ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అందులో కృష్ణవంశీ డైరక్షన్‌ లో వస్తున్న ''నక్షత్రం'' ఒకటి. ఈ సినిమా కోసం ముందుగా కాజల్‌ అగర్వాల్‌ ను హీరోయిన్‌ గా అనుకున్నా కూడా.. ఎందుకో కాజల్‌ లాస్టు మూమెంట్ లో హ్యాండిచ్చేలా ఉందని తెలుస్తోంది. అందుకే నిన్న హుటాహుటిన రెజీనాతో కలసి ఈ సినిమా కోసం ఒక ఫోటో షూట్‌ చేశాడు సందీప్‌. ప్రస్తుతం ఆ ఫోటోలను చూసి.. ఓ రెండు రోజుల్లో కృష్ణవంశీ ఒక నిర్ణయం తీసుకుంటాడట.

ఇప్పటికే బాలయ్యతో సినిమా వదిలేసుకున్న కాజల్‌.. ఇప్పుడు సందీప్‌ తో కూడా మూవీ పక్కనెట్టేయడానికి కారణం ఏంటబ్బా?? ఎవరో అంటున్నారు అక్కడ.. 2 కోట్లు రెమ్యూనరేషన్‌ జబ్బు ఇంకా వదల్లేదని. మాకేం తెలీదు.. మేమేం చెప్పట్లేదు.