Begin typing your search above and press return to search.

రెజీనాతో రొమాన్స్.. సోనమ్ అలా అనేసిందే!

By:  Tupaki Desk   |   12 Feb 2019 11:48 AM GMT
రెజీనాతో రొమాన్స్.. సోనమ్ అలా అనేసిందే!
X
తెలుగు తమిళ ప్రేక్షకులకు హీరోయిన్ రెజినా కసాండ్రా పేరు పరిచయమే. మన తెలుగు సినిమాలు మాత్రమే తీసుకుంటే హీరోయిన్ గా రెజీనాకు పెద్ద బ్రేక్ రాలేదు కానీ మంచి గుర్తింపు అయితే ఉంది. తెలుగులో ఈమధ్య సినిమాలు తగ్గడంతో తమిళంపై ఫోకస్ చేస్తున్న ఈ చెన్నై బ్యూటీ రీసెంట్ గా సోనమ్ కపూర్ సినిమా 'ఏక్ లడకీ కో దేఖాతో ఐసా లగా' తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

లెస్బియన్ లవ్ కథాంశంతో తెరకెక్కిన ఈ బోల్డ్ సినిమాలో సోనమ్ కపూర్ లవర్ గా రెజినా నటించింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రెజీనాతో రొమాన్స్ చేయడం గురించి సోనమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. "రెజీనా ఒక కూల్ అమ్మాయి .. ఓ మంచి నటి.. వీటన్నిటికంటే మించి రెజీనా దగ్గర ఎప్పుడు పరిమళం ఉంటుంది. అందుకే రెజీనా తో రొమాన్స్ చేయడం బాగుంటుంది. నేను హ్యాపీ" అని చెప్పుకొచ్చింది. ఎంతమరీ అమ్మాయి అయితే మాత్రం ఇలా డైరెక్ట్ గా చెప్తే హీరోలు ఎమైపోతారు. అసలే గుడ్ స్మెల్ అంటోంది.. హీరోలు అదేపనిగా వెనకాల పడరా?

అసలే బాలీవుడ్ భామ..బోల్డ్ కదా.. ఆమె సమాధానాలతో రెజినా సిగ్గుపడింది. ఇక సోనమ్ అంతటితో ఆగకుండా "సినిమాల్లో లీడ్ యాక్టర్ ను మేము ప్రేమించాల్సి వస్తుంది. నిజానికి మేము వారిని ప్రేమించం. సో.. అంతా నటనే." అంటూ రొమాన్స్ సంగతి కాస్త కవర్ చేసింది. రెజీనాకు బాలీవుడ్ కొత్త కాబట్టి ఇంకా బోల్డ్ కామెంట్స్ చేసినట్టు లేదు. లేకపోతే సోనమ్ రొమాన్స్ ఎలా ఉందో కాస్త వివరంగా చెప్పి ఉండేదే.