Begin typing your search above and press return to search.

అ! వల్లే ఆఫర్ వచ్చిందే!!

By:  Tupaki Desk   |   20 Feb 2018 6:48 AM GMT
అ! వల్లే ఆఫర్ వచ్చిందే!!
X
టాలీవుడ్ భామల అదృష్టం ఏమిటో గాని ఈ మధ్య రిజల్ట్స్ తో సంబంధం లేకుండా కొన్ని మంచి అవకాశాలను దక్కించుకుంటున్నారు. అందంలోనే సరికొత్త ప్రయోగాలకు సిద్ధపడుతోన్న బ్యూటీలను దర్శకనిర్మాతలు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా రెజీనా కూడా ఎక్కువగా అలాంటి పాత్రల్లో కనిపిస్తుండడంతో ఆమెకు సౌత్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇటీవల అ! సినిమాలో రెజీనా చేసిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. డ్రగ్స్ కి బానిసైన అమ్మాయిలగా నటించిన తీరుకు ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.

ప్రస్తుతం సౌత్ లొనే కాకుండా రెజీనా బ్రాండ్ గురించి నార్త్ లో కూడా చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ లో అమ్మడికి మంచి అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు తెలుగు తమిళ్ చిత్రాలకే పరిమితమైన ఈ బ్యూటి ఇక బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. షెల్లీ చోప్రా దర్శకత్వంలో ఏక్ లడ్కి కో దేఖా తో ఐసా అనే బాలీవుడ్ సినిమా తెరకెక్కనుంది. సోనమ్ కపూర్ - అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో ఒక డిఫెరెంట్ లేడీ రోల్ కోసం చిత్ర యూనిట్ గత కొంత కాలంగా చాలా మంది ఆడిషన్ కి ఆహ్వానించింది.

అయితే రీసెంట్ గా రెజీనా అయితే కరెక్ట్ గా సెట్ అవుతుందని దర్శకనిర్మాతలు ఫైనల్ చేశారట. గతంలో రెజీనా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు బాగానే చేసింది. అమితాబ్ బచ్చన్ సినిమాలో ఆమె సెలెక్ట్ అయ్యిందని కూడా వార్తలు చాలానే వచ్చాయి. కానీ ఎందుకో గాని ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఫైనల్ గా ఇప్పుడు రేజీనాకి వచ్చిన ఆఫర్ లో ఫిక్స్ అయ్యిందని సమాచారం. మరి ఆ లక్కీ ఛాన్స్ తో అమ్మడు బాలీవుడ్ లో అయినా హిట్స్ అందుకుంటుందో లేదో చూడాలి.