Begin typing your search above and press return to search.

నేను బీఫ్ తినేదాన్ని- రెజీనా

By:  Tupaki Desk   |   4 Oct 2015 5:30 PM GMT
నేను బీఫ్ తినేదాన్ని- రెజీనా
X
రెజీనా కసాండ్రా చూడ్డానికి చాలా సుకుమారంగా కనిపిస్తుంది కానీ.. ఆమె బీఫ్ సహా నాన్ వెజ్ బాగా లాగించేదట. కానీ ఈ మధ్య ఓ పాంప్లెట్ చదివాక కన్నీళ్లు పెట్టేసుకుని నాన్ వెజ్ మొత్తం మానేసి శాఖాహారిగా మారిపోయిందట ఈ చెన్నై సుందరి. ఆ సంగతులేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘ఒకప్పుడు నాకు నాన్ వెజ్ అంటే చాలా చాలా ఇష్టం. బీఫ్ - చికెన్ చాలా ఇష్టంగా తినేదాన్ని. ఓసారి అనుకోకుండా పెటా వాళ్లు ముద్రించిన పాంప్లెట్ ఒకటి చదివా. అందులో చెప్పిన కొన్ని విషయాలు నన్ను కంటతడి పెట్టించాయి. జంతువుల్ని ఎంతో ప్రేమించే నేను వాటినే తినడం సరి కాదనిపించింది. దీంతో శాఖాహారిగా మారిపోయాను’’ అంది రెజీనా. తాను మంచి భోజన ప్రియురాలినని.. ఐతే షూటింగ్ సమయంలో మాత్రం ఏమీ తిననని.. తినడం మొదలుపెడితే పని మీద ఏకాగ్రత కుదరదేమో అని.. తనకు దగ్గర్లో ఏ ఆహార పదార్థాలు లేకుండా చూసుకుంటానని రెజీనా చెప్పింది.

తన తల్లిది కర్ణాటక అని.. తండ్రిది నార్త్ ఇండియా అని.. అమ్మమ్మ ఆంగ్లో ఇండియన్ - తాతయ్య అయ్యంగార్ అని.. పుట్టింది చెన్నైలోనే అయినా.. తనది ఏ ప్రాంతం అని అడిగితే చెప్పడానికి ఇబ్బంది పడతానని రెజీనా చెప్పింది. చిన్నప్పుడు ఆర్మీ డాక్టర్ కావాలనుకున్నానని.. ఐతే డాక్టర్ అయితే ఫ్యామిలీ లైఫే ఉండదని అందరూ భయపెడితే సైకాలజీలో డిగ్రీ చేశానని రెజీనా వెల్లడించింది.