Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మిస్ బ్యాక్ లెస్సు

By:  Tupaki Desk   |   30 Nov 2015 11:30 AM GMT
ఫోటో స్టోరి: మిస్ బ్యాక్ లెస్సు
X
వాలు క‌నుల‌తో వ‌ల‌లు వేయ‌డంలో రెజీనా త‌ర్వాతే. అందుకే పోటీలో ఎందరు ఉన్నా .. త‌న‌కంటూ ఎదురే లేద‌ని ప్రూవ్ చేస్తోంది. వారియ‌ర్ క్వీన్‌ లా కెరీర్ గ్రాఫ్‌ ని పైపైకి న‌డిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు నారా రోహిత్‌ - మ‌నోజ్ లాంటి న‌వ‌త‌రం హీరోల స‌ర‌స‌న ఆడిపాడుతోంది. మ‌రోవైపు మెగా హీరోల‌తో సినిమాల‌కు గాలం వేస్తోంది.

టాలీవుడ్‌ లో మోస్ట్ ప్రామిస్సింగ్ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకున్న రెజీన ప్ర‌స్తుతం ఓ ట్యాలెంట్ షోకి జడ్జిగా ఎంపికై సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌ఖ్యాత టైమ్స్ ఆఫ్ ఇండియా త‌ల‌పెట్టిన భారీ ఈవెంట్ `మిస్ ఫ్రెష్ ఫేస్ -2015` సెల‌క్ష‌న్స్‌ కి జ‌డ్జిగా ఎంపికైంది. ఇందులో న‌వ‌త‌రం అంద‌గ‌త్తెల్ని కాచి వ‌డ‌పోచి చివ‌రికి ఒక మిస్సుని ఎంపిక చేసే కార్య‌క్ర‌మాన్ని ప్ర‌మోట్ చేసే బాధ్య‌త‌ను త‌న‌పై వేసుకుంది. చెన్న‌య్ నుంచి వ‌చ్చిన ఈ చంద్రం ఇప్పుడు ఏకంగా మిస్ ఆంధ్రా - మిస్ తెలంగాణ ఎవ‌రో తేల్చేయ‌బోతోంద‌న్న‌మాట‌!

అయితే ఇదిగో ఈ సంద‌ర్భంగా కండ‌క్ట్ చేసిన లాంచింగ్ ఈవెంట్‌ లో ఇలా క‌నిపించి షాకిచ్చింది. మిస్సును ఎంపిక చేయాలంటే ముందు మిస్ పెర్ఫెక్ట్ అనిపించుకోవాలి. ఇదిగో ఇలా బ్యాక్‌ లెస్‌ లో ఫోజులిస్తేనే అది పాజిబుల్‌. ఈ నీలాల క‌న్నుల చిన్న‌ది న‌ల్ల‌రంగు డ్రెస్‌ లో జిగేల్మ‌నిపోవ‌డం లేదూ? బ‌్యాక్ లెస్ ఫోజుల్లో మెరుపులు మెరిపించ‌డం లేదూ? వీపు చూడు.. నా వీపందం చూడు అంటూ ఊరించ‌డం లేదూ?