Begin typing your search above and press return to search.

రెజీనా గ్లామర్ పై ఎనీ మోర్ కామంట్స్

By:  Tupaki Desk   |   26 Jan 2016 9:13 AM GMT
రెజీనా గ్లామర్ పై ఎనీ మోర్ కామంట్స్
X
రెజీనా కసాండ్రా ఇండస్ట్రీలోకి వచ్చినపుడు ఈ హీరోయిన్ పై బోలెడన్ని కామెంట్స్ పడ్డాయి. పెర్ఫామెన్స్ పాత్రలకి తప్ప గ్లామర్ రోల్స్ కి పనికి రాదని అనేశారు. దీంతో ఈమెకు భారీ చిత్రాల ఆఫర్స్ రాకపోవడమే కాదు.. గ్లామర్ డాళ్ గా మెరిసే అవకాశం కూడా చిక్కలేదు. రీసెంట్ గా ఈ ఇమేజ్ నుంచి బయటపడేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తోంది రెజీనా.

సుబ్రమణ్యం ఫర్ సేల్ లో పెర్ఫామెన్స్ కి గ్లామర్ అద్ది, డ్యాన్సులు వేసింది. ఈ మూవీ హిట్ అయినా.. ఫుల్ ప్లెడ్జెడ్ గా గ్లామర్ రోల్ చేసిన సౌఖ్యం గట్టి దెబ్బే కొట్టింది. దీంతో మళ్లీ ఈమె గ్లామర్ కి మరకలు అంటాయి. వరుసగా వస్తున్న ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడానికి ఈ కుర్ర బ్యూటీ మంచి ప్లాన్ వేసింది. ఇప్పుడు హైద్రాబాద్ లో జరుగుతున్న ఐఫా వేడుకలకు తన గ్లామర్ అవతారాన్ని ప్రదర్శించేసింది. మొత్తం బాడీ అంతా డ్రస్ ఉన్నా.. ఎక్కడ ఏమేం చూపించాలో, వాటిని బయట పెట్టసింది ఈ డ్రస్. అంతే కాదు కంప్లీట్ క్లీవేజ్ తో కట్టిపడేసింది.

ఇంచుమించు దేవతా స్త్రీ నడిచివస్తోందా అనిపించేలా ఉన్న రెజీనా డ్రసింగ్ కి.. అందరూ మంత్రముగ్ధులైపోయారు. రెజీనాలో ఇంత గ్లామర్ ఉందా అని ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఒకే ఒక్క ప్రదర్శనతో.. తనేంటో, తన అందమేంటో, తనలో ఉన్న గ్లామరేంటో చూపించింది రెజీనా. ఈ గెటప్ లో చూసిన తర్వాత.. ఎవరైనా సరే రెజీనా గ్లామర్ పై కామెంట్ చేయాలంటే కష్టమే. వాళ్లకు అసలు టేస్ట్ లేదు అని మిగతావాళ్లు విరుచుకుపడేంతగా రెచ్చిపోయింది రెజీనా.