Begin typing your search above and press return to search.

గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసిందే..

By:  Tupaki Desk   |   17 Jun 2018 7:14 AM GMT
గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేసిందే..
X
తమిళ సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టి.. తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించిన కథానాయిక రెజీనా కసాండ్రా. కెరీర్ ఆరంభం నుంచి ఆమె ఎక్కువగా ట్రెడిషనల్ క్యారెక్టర్లే చేస్తోంది. కొన్ని సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించినప్పటికీ.. ఎప్పుడూ హద్దులు దాటింది లేదు. కానీ ఆమె టాలెంటుకు తగ్గ అవకాశాలు రాలేదు. వరుస ఫ్లాపులతో టాలీవుడ్ నుంచి దాదాపుగా నిష్క్రమించే పరిస్థితి వచ్చేసింది. కోలీవుడ్లో కూడా ఆమె కెరీర్ ఏమంత గొప్పగా లేదు. ఇలాంటి టైంలో తన కెరీర్‌కు కీలకంగా మారిన సినిమా కోసం రెజీనా ఆలౌట్ ఎఫర్ట్ పెట్టేసింది.

కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా తెరకెక్కుతున్న ‘మిస్టర్ చంద్రమౌళి’ అనే చిత్రం కోసం బికినీలో అందాలు ఆరబోసేసింది రెజీనా. కెరీర్లో ఎన్నడూ ఆమె ఇంత సెక్సీగా కనిపించింది లేదు. ఈ సినిమా విడుదలకు ముందే ఈ చిత్రంలోని ఒక హాట్ సాంగ్ రిలీజ్ చేసేశారు. అది రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. రెజీనా ఇంతలా రెచ్చిపోయిందేంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కేవలం సినిమాలోనే కాదు.. బయట సైతం రెజీనా గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేస్తోంది. శనివారం రాత్రి జరిగిన ఫిలిం ఫేర్ అవార్డుల వేడుక కోసం రెజీనా తయారై వచ్చిన తీరు అందరికీ పెద్ద షాకే. ఈ స్థాయిలో క్లీవేజ్ షో ఆమె ఎప్పుడూ చేయలేదు. ఇన్నాళ్లూ మడికట్టుకు కూర్చుని కెరీర్ ముగిసిపోతున్న దశలో రెజీనా మరీ ఈ స్థాయిలో రెచ్చిపోవడమేంటో జనాలకు అర్థం కావడం లేదు.