Begin typing your search above and press return to search.

జ్యో అచ్యుతానంద పాడుతున్న రెజీనా

By:  Tupaki Desk   |   27 Sep 2017 5:08 PM GMT
జ్యో అచ్యుతానంద పాడుతున్న రెజీనా
X
ఓ హీరోయిన్.. జ్యో అచ్యుతానంద జోజో ముకుంద అని పాడడం అంటే.. అదేదో సినిమాలో సీన్ అయుండాలి. కానీ టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రా మాత్రం రియల్ లైఫ్ లోనే ఈ పాట పాడేందుకు రెడీ అయిపోయింది. అదేంటీ.. అమ్మయిన తర్వాత కదా ఇలాంటి పాటలను అమ్మాయిలు పాడాలి అనే డౌట్ కామన్ గానే వస్తుంది.

కానీ ఇప్పుడు నిజంగానే రెజీనా అమ్మయిపోయింది. అలాగని పెళ్లి చేసుకుని పిల్లలను కనేసి అమ్మ అవాల్సిన అవసరం లేదు కదా. పోనీ ఇప్పుడు చాలామంది ఫాలో అవుతున్న టెక్నాలజీ ప్రకారం సరోగసీ ద్వారా కూడా అమ్మ కాలేదు రెజీనా. సుస్మితా సేన్ లాంటి కొందరు సీనియర్లు చూపించిన బాటలో.. ఎంచక్కా ఓ చిన్నారిని దత్తత తీసేసుకుని అమ్మగా మారిపోయింది. అలా పెళ్లి చేసుకోకుండానే తల్లి అయిపోయింది రెజీనా కసాండ్రా. జొయెల్లి డానియెల్ అనే ఆడపిల్లను దత్తత తీసుకున్న ఈ భామ.. ఇప్పుడు తాను గాడ్ మదర్ గా మారిపోయానని సంతోషంగా చెబుతోంది. కనకపోయినా పెంచిన ప్రేమను పంచి.. అమ్మగా ఆ ఆనందాన్ని అనుభవించాలని భావిస్తోంది రెజీనా.

ఓ చిన్ని పాపకు గాడ్ మదర్ గా మారిన రెజీనాకు ఇప్పుడు బోలెడన్ని అభినందనలు వస్తున్నాయి. అటు ఇండస్ట్రీ నుంచి ఇటు నెటిజన్ల నుంచి బోలెడన్ని అభినందనలు వచ్చేస్తున్నాయి. ఏమైనా అందాల భామలకు ఈ మధ్య పిల్లల మీద ప్రేమ పెరుగుతోంది. కానీ తాము కని అమ్మగా ఆనందాన్ని అనుభవించాలంటే.. అందుకు వయసు దాటిపోతోంది. అందుకే అనుకుంటా.. ఈ మధ్యనే సన్నీలియోన్ కూడా దత్తత తీసుకుని అమ్మగా మారిన సంగతి గుర్తుంది కదా!