Begin typing your search above and press return to search.

​రంగస్థలం సినిమా పంట పండినట్లే

By:  Tupaki Desk   |   24 Jun 2017 11:00 AM GMT
​రంగస్థలం సినిమా పంట పండినట్లే
X
కొన్ని సినిమా పోస్టర్లు ఆ సినిమా ఎలా ఉండబోతుందో ఎటువంటి డ్రామా ఉండబోతుందో బాగా చెప్పగలుగుతాయి. అలానే కొన్ని సినిమాలుకు పోస్టర్ చూసినప్పుడే ఫిక్స్ అవుతారు ప్రేక్షకులు ఈ సినిమాని చూద్దామా లేక లైట్ తీసుకుందామాని. ఇప్పుడు రాబోతున్న రామ్ చరణ్ రంగస్థలం 1985 సినిమా పోస్టర్ కూడా ప్రేక్షకులలో ఈ సినిమా తప్పకుండా చూడాలి అనే భావాన్ని కలగచేశారు ఆ చిత్ర యూనిట్. ఈ సినిమా కోస్తా తీరప్రాంతంలో గోదావరి నది ఒడ్డున పచ్చని పొలాలలో ఒక పల్లెటూరు కుర్రాడి ప్రేమకథ అని చెబుతున్నారు. సినిమా షూటింగ్ ఇంకా పూర్తికానే లేదు అప్పుడే ఈ సినిమా రైట్స్ కోసం ఎగబడి వచ్చి పట్టుకుపోతున్నారట.

సుకుమార్ డైరక్షన్లో వస్తున్న రంగస్థలం సినిమా రైట్స్ కోసం పంపిణీదారులు పోటీపడి మరి కొనుక్కోవడానికి వస్తున్నారు. అందుకే థియేట్రికల్ రైట్స్ కోసం రికార్డు స్థాయిలో మార్కెట్ పెరిగిందని తెలుస్తుంది. ఇప్పటికే శాటిలైట్ రైట్స్ కోసం 16 కోట్లు డీల్ జరిగిందని ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే అమెజాన్ ప్రైమ్ వాళ్ళు డిజిటల్ రైట్స్ ని 13 కోట్లు డీల్ చేసుకున్నారట. శ్రీమంతుడు - జనతా గ్యారేజ్ వంటి సినిమాలు నిర్మించిన మైత్రి మూవీ మేకర్స ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడంతో మరింత నమ్మకంగా కొనుగోలుదారులు వస్తున్నారు. మొత్తానికి విడుదలకు ముందే కలెక్షన్లు మొదలుపెట్టింది అన్నమాట. దాదాపు రిలీజ్ కు ముందే 50% డబ్బులు రికవరీ అయిపోయిందనమాట.

రంగస్థలం 1985 సినిమాను సుకుమార్ డైరక్షన్లో రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రత్నవేలు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/