Begin typing your search above and press return to search.

కామెంట్: రాజమౌళి చిన్న జీవిని తీసుకుంటే...

By:  Tupaki Desk   |   4 Aug 2015 12:26 PM GMT
కామెంట్: రాజమౌళి చిన్న జీవిని తీసుకుంటే...
X
రాజమౌళి మరో సీక్వెల్ తీయబోతున్నాడా ? ఇంకా బాహుబలి సీక్వెలే రిలీజ్ కాలేదు... అఫ్పుడే ఇంకో సీక్వెలేంటి అనుకుంటున్నారా? కానీ జక్కన్న మరో సీక్వెల్ తీయడం ఖాయమే అని తెలుస్తోంది. అయితే.. ఇది గతంలో తాను గ్రాఫిక్స్ తో వండర్స్ సృష్టించిన ఈగకు సెకండ్ పార్ట్ కావడం విశేషం.

ఈగ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు రాజమౌళి. ఆయన కష్టానికి తగ్గ రిజల్ట్ వచ్చింది కూడా. ఇప్పుడు బాహుబలి తో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయాడు కూడా. అప్పుడు తీసిన ఈగ ప్రపంచాన్ని ఆకట్టుకుంది, పేరు తెచ్చింది కానీ... ఇతర దేశాల నుంచి తగినంతగా క్రేజ్ రాలేదు. ఇప్పుడు ఫ్రం ద డైరెక్టర్ ఆఫ్ బాహుబలి అంటూ స్టాంప్ వేసుకుని... ఓ హాలీవుడ్ మూవీ రేంజ్‌ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. దానికి తోడు... భారీ హంగామాలు ఎక్కువగా అవసరం లేదు. లోబడ్జెట్‌ తో హాలీవుడ్ రేంజ్ మూవీ తీసి... ప్రపంచాన్ని తన దృష్టికి మరల్చుకోవచ్చన్నది జక్కన్న ఆలోచన అంటున్నారు.

నిజానికి రాజమౌళి తో సినిమా చేసేందుకు చాలామంది టాప్ స్టార్స్ క్యూ లో ఉన్నారు. ఊ అంటే చాలు... స్టోరీ లైన్ కూడా అడక్కుండానే సై అనేందుకు సిద్ధం అనేవారు కూడా ఉన్నారు. అయినా సరే.. జక్కన్న మాత్రం చాలా జాగ్రత్త గా ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమా,సినిమాకి తన స్థాయి పెంచుకుంటున్నాడు కూడా. అందుకే స్టోరీ డిమాండ్ చేస్తే తప్ప స్టార్ల జోలి కి వెళ్లడం లేదు. వీటన్నిటికంటే ముఖ్యంగా... బాహుబలి తర్వాత స్టార్ హీరో తో సినిమా చేస్తే.. అంచనాలు పెరిగిపోతాయి. అదే ఈగ అంటే... హైప్, క్రేజ్ డిఫరెంట్‌ గా ఉంటాయి. అందుకే ఈ చిన్నజీవిని ఎంచుకున్నాడని తెలుస్తోంది.

రాజమౌళి డిఫరెంట్ థాట్‌ కి తెలుగు ఇండస్ట్రీ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు. బాహుబలి తర్వాత తమ హీరోతో జక్కన్న సినిమా ఉంటుందని అనుకుంటున్న మహేష్ బాబు ఫ్యాన్స్‌ కి మాత్రం ఇది నిరాశ కలిగించే న్యూసే. అన్నట్లు ఈగకు సీక్వెల్ తీసే ఆలోచన ఉందని గతంలోనే చెప్పాడు రాజమౌళి. సీక్వెల్ తీయడానికి తగినట్లుగానే... ఆ సినిమా ఎండింగ్ కూడా ఉంటుంది. గుర్తుంది కదూ..