ఎన్టీఆర్ కౌగిలింతల వెనక అంత కథుందా?

Wed Sep 13 2017 13:54:51 GMT+0530 (IST)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులపై ఎప్పుడూ ప్రేమను చాటుకుంటూనే ఉంటాడు. అలాగే కుటుంబం పట్ల కూడా తన వాత్సల్యాన్ని అమితంగానే ప్రదర్శిస్తూ ఉంటాడు. తాత ఎన్టీఆర్ పై.. తండ్రి హరికృష్ణపై  ఎన్టీఆర్ చూపించే ప్రేమ అసామాన్యం అనిపించేస్తుంది.అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్ మాటల్లో కొంత తేడా వచ్చింది. రీసెంట్ గా జై లవకుశ ఆడియో ఫంక్షన్ లో అయితే.. అభిమానులకే తన జీవితం అంకితం అనేశాడు. ఈ జన్మకు ఫ్యాన్స్ తోనే ఉంటానని.. తండ్రికి చెప్పేశాడు కూడా. అయితే.. ఇందులో బాబాయ్ నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేసే అంతరార్ధం ఉందనే వాదన కొత్తగా మొదలైంది. బాలయ్య ఈ మధ్య ఎక్కువగా అభిమానుల చెంప పగలగొట్టడం అనే టాపిక్ పై వార్తల్లో నానుతున్నారు. అఫ్ కోర్స్ అది కూడా ప్రేమే అని చెప్పే పూరీ లాంటి వాళ్లు చుట్టుపక్కల ఉన్నారు. తను కూడా కొట్టడం కరెక్టే అన్నట్లుగా బాలయ్య చెప్పేశారు.

ఇలాంటి సమయంలో తండ్రికి మించి అభిమానులే ముఖ్యం అని ఎన్టీఆర్ చెప్పడం వెనక.. నందమూరి అభిమానులకు సిగ్నల్స్ పంపే యాంగిల్ ఉందట. అంటే.. బాలకృష్ణ కొడుతుంటారు.. ఎన్టీఆర్ అయితే అభిమానులే ముఖ్యం అంటూ ప్రేమాభిమానాలు చాటుకుంటూ కౌగిలించుకుని దగ్గరకు తీసుకుంటారు అనే ఎసెన్స్ ను ఫ్యాన్స్ లో ఎక్కించే ప్రయత్నమే ఇది అని ఆరోపిస్తున్నారు కొందరు. ఈ టాక్ వెనక వాస్తవం ఎంతుందో ఎన్టీఆర్ కే తెలియాలి.