కలెక్షన్ రాకపోవడానికి కారణం ఇదేనా?

Tue Jan 15 2019 07:00:01 GMT+0530 (IST)

భారీ అంచనాల నడుమ విడుదలైన ఎన్టీఆర్ సినిమా కు పాజిటి టాక్ దక్కింది. సహజంగా ఇలాంటి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే భారీ వసూళ్లు నమోదు కావడం ఖాయం. కానీ ఎన్టీఆర్ సినిమా విషయంలో సీన్ రివర్స్ అయింది. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. కానీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టడంలో విఫలం అయ్యింది. ఇందుకు కారణం ఏంటి అనే విషయంపై రకరకాలుగా విశ్లేషణలు వస్తున్నాయి.



ఎన్టీఆర్ బయోపిక్ ను బాలకృష్ణ తీయడం వల్ల మొత్తం పాజిటివ్ గా చూపించాడనే టాక్ వచ్చింది. ఎన్టీఆర్ లో కేవలం పాజిటివ్ లు మాత్రమే చూపారని నెగటివ్ లు పూర్తిగా మరిచారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ సమయంలోనే బాలకృష్ణ తెలంగాణ రాజకీయాల్లో తన ముద్ర వేసేందుకు ఎన్నికల సమయంలో ప్రయత్నించి ఫ్లాప్ అయ్యాడు. ఆ ఎఫెక్ట్ కూడా ఈ సినిమాపై ఉందని కొందరు అంటున్నారు.

మొత్తానికి ఎన్టీఆర్ కలెక్షన్స్ తక్కువ రావడానికి పలు కారణాలు ఎవరికి తోచినవి వారు చెప్పేస్తున్నారు. ఒకటి మాత్రం కన్ఫర్మ్ ఏంటి అంటే ఎన్టీఆర్ సినిమాను బాలకృష్ణ కాకుండా మరెవ్వరూ తీసినా కూడా భారీగా వసూళ్లు నమోదు అయ్యేవి.