రంగస్థలం అందుకే లేటవుతోందా?

Fri Oct 13 2017 14:01:18 GMT+0530 (IST)

రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రంగస్థలం 1985. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ సుదీర్ఘంగానే కొనసాగుతోంది. మొదట ఈ మూవీ దీపావళికి వస్తుందని అన్నారు. ఆ తర్వాత క్రిస్మస్ అన్నారు.. ఇప్పుడు సంక్రాంతికి అనే మాట వినిపిస్తోంది కానీ అది కూడా కష్టమేనట.ఇందుకు ప్రధాన కారణం.. రంగస్థలంకు కూడా గ్రాఫిక్స్ తలనొప్పులు తప్పడం లేదట. బాహుబలి తర్వాత నాసిరకం గ్రాఫిక్స్ ను జనాలు మెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రీసెంట్ గా ఇలా చేసి స్పైడర్ ఏ స్థాయిలో దెబ్బ తిందో చూశాం. అయితే.. రంగస్థలం మూవీ పీరియాడిక్ కదా.. గ్రాఫిక్స్ తో పనేంటి అనుకోవచ్చు. సినిమా మొదలుపెట్టినపుడు గ్రాఫిక్స్ గురించి పెద్దగా అనుకోలేదు. కానీ గోదావరి జిల్లాల్లో షూటింగ్ అంటే ఎంత కష్టమో యూనిట్ కి బాగానే తెలిసొచ్చింది. నెలన్నరకు పైగా షూటింగ్ చేసినా.. పెద్దగా వర్క్ జరగలేదు.

అందుకే.. ఆ తర్వాత హైద్రాబాద్ లో విలేజ్ సెట్ వేసుకుని షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు హైద్రాబాద్ సెట్ లో తీసిన సీన్స్ ను గోదావరి ఒడ్డున తీసిన ఫీలింగ్ కల్పించాల్సి ఉంటుంది. షూటింగ్ పార్ట్ అయితే చాలావరకూ అయిపోయింది కానీ.. ఈ గ్రాఫిక్స్ వర్క్ అంతా తెమిలేపాటికి చాలానే సమయం పట్టేట్లుగా ఉందిట.