అజ్ఞాతం అందుకే వీడాడా!?

Mon May 28 2018 10:22:08 GMT+0530 (IST)

త్రివిక్రమ్ శ్రీనివాస్ సహజంగా మీడియాకు దూరంగానే ఉంటాడు. ఇమేజ్ కోసం.. క్రేజ్ కోసం ఇంటర్వ్యూలు ఇవ్వడం.. ఏదో ఒకటి మాట్లాడుతుండడం వంటివి మాటల మాంత్రికుడు చేయడు. అయితే.. ఇప్పుడు ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూలు ఇవ్వడం.. కొంచెం పర్సనల్ అనిపించే వ్యవహారాలను మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది.అసలు తన సినిమా గ్రాండ్ సక్సెస్ అయినపుడు కూడా త్రివిక్రమ్ మాట్లాడిన దాఖలాలు తక్కువ. అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత కూడా అసలు స్పందించిన ఛాయలు లేవు. కానీ ఇప్పుడు ఎలాంటి సమయం సందర్భం లేకుండా.. హఠాత్తుగా ఇంటర్వ్యూ ఇవ్వడం వెనుక.. పూనమ్ కౌర్ ఆరోపణలు చేయడమే కారణంగా చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. గత కొంతకాలంగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తోంది. పేరు చెప్పకపోయినా.. ఇవన్నీ త్రివిక్రమ్ ను ఉద్దేశించే అని అనిపించేలా కామెంట్స్ పెడుతోంది.

ఇప్పుడు ఈ విషయంపై రియాక్ట్ కాకపోయినా.. తాను తన కుటుంబాన్ని సినిమా రంగానికి దూరంగా ఎందుకు ఉంచుతాడో వివరంగా చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అంతే కాదు.. తనకు పలుమార్లు హీరోయిన్లతో రిలేషన్ షిప్ అంటగడుతూ కూడా కొన్ని కథనాలు వచ్చాయని అన్నాడు. ఇదంతా పూనమ్ కౌర్ చేసిన ఇన్ డైరెక్టు కామెంట్స్ కు.. ఇన్ డైరెక్టుగా సమాధానం ఇచ్చే ప్రయత్నమేనని.. అందుకనే ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటాడని సినిమా జనాలు అనుకుంటున్నారు.