Begin typing your search above and press return to search.

మళ్ళీ మళ్ళీ అదే సోదెందుకు తాప్సీ??

By:  Tupaki Desk   |   27 March 2017 9:18 AM GMT
మళ్ళీ మళ్ళీ అదే సోదెందుకు తాప్సీ??
X
మొన్నామధ్యన ఒక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్యూలో టాలీవుడ్ లో నన్ను ఐరన్ లెగ్ అన్నారు అని చెప్పింది. ఆ తరువాత తనకు గ్లామర్ రోల్స్ మాత్రమే ఇచ్చారు అని సెలవిచ్చింది. నా యాక్టింగ్ టాలెంట్ ను గుర్తించి నాకు సరైన రోల్స్ ఇవ్వలేకపోయారు తెలుగు డైరక్టర్లు అంటూ కామెంట్ చేసింది. ఇక మళ్ళీ మళ్ళీ అవే చెబుతోంది రింగుల జుత్తు బ్యూటి తాప్సీ పన్ను.

ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన తాప్సీ.. ఎక్కువశాతం గ్లామర్ ఆరబోస్తూనే దాదాపు ఇక్కడ డజను సినిమాలు చేసింది. దర్శకులు అడిగారనో.. లేక హీరోలు కోరారనో.. ఈవిడను అంత గ్లామర్ ఆరబోయమని ఎవరు చెప్పారు? పైగా ప్రతీ సినిమాకూ 20 నుండి 40 లక్షల మధ్యలో పారితోషకం తీసుకునే నటించింది తాప్సీ. గట్టిగా ఒక 3-4 కోట్లు సంపాదించుకునే టాలీవుడ్ నుండి ముంబయ్ చెక్కేసింది. ఒకవేళ మిష్టర్ ఫర్ఫెక్ట్ వంటి సినిమాతో హిట్టు కొట్టిన తాప్సీ.. ఆ తరువాత ఇక్కడున్న తన స్నేహితుల ప్రభావంతో కొన్ని పెద్ద సినిమాలు వదులుకోకుండా ఉంటే మాత్రం.. పెద్ద హీరోయిన్ అయ్యేదే కాని.. ఆమెకు మాత్రం ఆత్రం ఆగక ఆ సినిమాలు వదిలేసుకుంది. కాని ఇప్పుడు తనకు నటనలో అక్షరాభ్యాసాలు దిద్దించిన టాలీవుడ్ ను నిందించడమే పనిగా పెట్టుకుంది.

ఒక ప్రక్కన బాహుబలి హిట్టవ్వడంతో టాలీవుడ్ క్రేజ్ ఇండియా అంతటా వెలిగిపోతోంది. మరో ప్రక్కన తాప్సీ కొత్త సినిమా నామ్ షబానా రిలీజవుతోంది. సో ఈ టైములో రెండింటినీ లింక్ చేసి సోది చెబితే ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది. అందుకే తాప్సీ ఈ స్ర్టాటజీ ఎన్నుకున్నట్లుంది. కాని పదే పదే టాలీవుడ్ బ్యాడ్ అనే సోది చెబితే మనోళ్ళు ఎలా వింటూ ఉంటారు అనుకుందో ఏంటో!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/