Begin typing your search above and press return to search.

సుధీర్ ఎందుకు నో చెప్పాడు?

By:  Tupaki Desk   |   23 Oct 2018 7:59 AM GMT
సుధీర్ ఎందుకు నో చెప్పాడు?
X
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న మల్టీ యాక్టర్ మూవీ వీరభోగవసంతరాయలు అంతంత మాత్రంగానే ఉన్న అంచనాలతో ఓపెనింగ్స్ విషయంలోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది. తీరుతెన్ను లేని ప్రమోషన్స్ ఒక కారణంగా చెప్పొచ్చు. దీనికి తోడు ట్రైలర్ లో సుధీర్ బాబు పాత్రకు ఇంకొకరు డబ్బింగ్ చెప్పడం గురించి ఇప్పటికే రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ట్విట్టర్ ద్వారా టీజర్ లో ఉన్న గొంతు తనది కాదన్న సుధీర్ కారణాలు మాత్రం బయటికి చెప్పడం లేదు. తనకు క్రెడిట్ ఇవ్వలేదని అందుకే డబ్బింగ్ చెప్పేందుకు నిరాకరించాడని ఒక మీడియాలో వచ్చిన కథనాన్ని అబద్దం అని తేల్చిన సుధీర్ టైం వచ్చినప్పుడు మ్యాటర్ చెబుతాను అంటున్నాడు తప్ప నిజం మాత్రం చెప్పలేదు.

కథలో ప్రాముఖ్యత లేకపోవడమా లేక ముందు చెప్పినట్టుగా తెరకెక్కించకపోవడమా లేక సాధారణంగా ఇలాంటి ఇష్యూస్ లో కామన్ గా ఉండే పారితోషికాల చెల్లింపా ఏదీ క్లారిటీ లేదు. రేపు వచ్చే కాసిన్ని ప్రేక్షకులు సుధీర్ బాబు గొంతు వేరేలా ఉంటే తేడా అనిపించడం ఖాయం. ఇలా ఫైనల్ వెర్షన్ కు గొంతు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేసాడు అంటే చాలా బలమైన కారణమే ఉండి ఉండాలి. ఇటీవలే వచ్చిన నన్ను దోచుకుందువటే రిపోర్ట్స్ వచ్చినంత పాజిటివ్ గా సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోవడం పట్ల కాస్త అసంతృప్తిగానే ఉన్నప్పటి ఈ ఏడాది సుధీర్ కు బాగానే కలిసి వచ్చింది.

కానీ ఇప్పుడీ వీరభోగవసంతరాయలు ఇటు పాత్ర పరంగా అటు డబ్బింగ్ విషయంగా రెండు రకాలుగా డ్యామేజ్ చేస్తుందేమో అన్న సంశయం మాత్రం లోలోపల ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్య పబ్లిసిటీలో శ్రీవిష్ణుతో పాటు నారా రోహిత్ ఈ ఇద్దరినే ఎక్కువ హై లైట్ చేయడం వెనుక కారణం కూడా ఏమై ఉంటుందో. దీనికి సుధీర్ బాబు డబ్బింగ్ చెప్పకపోవడానికి ఏమైనా లింక్ ఉన్నా ఉండొచ్చు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.