రోబో టీమ్ ఫోటోగ్రాఫర్లను ఎందుకు కొట్టింది?

Thu Mar 23 2017 12:26:11 GMT+0530 (IST)

ఇదో వింత సీన్. ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయంపై అంత తేలికగా తేల్చేయలేం. ఇప్పుడు తమిళనాడులో రోబో 2.0 టీమ్ ఒక ప్రముఖ వార్తాపత్రిక ఫోటోగ్రాఫర్ ను తమ బౌన్సర్లతో ఎటాక్ చేయించదనే న్యూస్ సంచలనంగా మారింది. అసలు వారు ఎందుకు ఈ ఫోటోగ్రాఫర్ ను ఆపారు అనే విషయం తెలుసుకుందాం పదండి.

నిజానికి డే అండ్ నైట్ షూట్లతో డైరక్టర్ శంకర్ బిజీగా ఉన్నాడు. రజనీకాంత్ అండ్ యామీ జాక్సన్ తో కలిపి ఇప్పుడు చెన్నయ్ లోని ట్రిప్లికేన్ ఏరియాలో షూటింగ్ చేస్తున్నాడు. అయితే రాత్రి షూట్ అంటే పొద్దున్నే 6 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. కాని మనోళ్ళు 8 గంటల వరకు షూట్ చేశారు. దానిదేముంది.. షూటింగ్ అంటే అలా ఎక్సటెండ్ అయ్యే ఛాన్సుంటుంది. కాని మీరు రూల్స్ ను ఉల్లంఘించారు అంటూ చెప్పడానికి ది హిందూ పత్రిక ఫోటోగ్రాఫర్ వెంటనే వారిని ఫోటోలు తీయబోయాడు. అయితే ఎక్కడ రజనీకాంత్ లుక్ లీకైపోతుందేమో అని భయపడిన శంకర్ అసిస్టెంట్ డైరక్టర్ ఒకరు.. బౌన్సర్లకు చెప్పి ఈ ఫోటోగ్రాఫర్ ను అడ్డుకోవడంతో.. వెంటనే అతగాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తరువాత సినిమా ప్రొడక్షన్ టీమ్ హిందూ యాజమాన్యంతో మాట్లాడటంతో.. కేసును అతగాడు ఉపసంహరించుకున్నాడు.

టైమ్ కు షూటింగ్ పూర్తవ్వనప్పుడు ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయకపోవడం 2.0 టీమ్ చేసిన తప్పైతే.. 200 కోట్ల సినిమా కు సంబంధించి తానేదో అద్భుతమైన న్యూస్ ను కవర్ చేయాలి అన్నట్లుగా ఒక్క ఫోటోతో ప్రపంచానికి లుక్ లీక్ చేసేద్దాం అనుకోవడం ఆ ఫోటోగ్రాఫర్ ది కూడా తప్పే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/