సమంత `కేఫ్`రిబ్బన్ కట్ సరదా!

Thu Jul 12 2018 22:34:33 GMT+0530 (IST)

అక్కినేని సమంత.....టాలీవుడ్ - కోలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు. రంగస్థలం - మహానటి వంటి వరుస హిట్లతో దూసుకుపోతోన్న బ్యూటీ. అటువంటి స్టార్ స్టేటస్ ఉన్న సమంత...ఏదన్నా షాపింగ్ మాల్స్ - బ్రాండెడ్ క్లాత్ షోరూమ్ ఓపెనింగ్ కు రావడంలో పెద్ద విషయం...విశేషం ఏమీ లేదు. కానీ ఆ స్టార్ స్టేటస్ ను పక్కన పెట్టి మరీ సమంత ఓ చిన్న షాప్ ఓపెనింగ్ కు వచ్చిందంటే ....అది నిజంగా విశేషమే. తాజాగా హైదరాబాద్ లోని ఓ చిన్న కేఫ్ ఓపెనింగ్ కు సమంత హాజరై సందడి చేయడంతో చాలామంది అవాక్కయ్యారు. బహుశా ...ఆ షాప్ ఓనర్ శామ్ కు పరిచయస్తులయి ఉంటారని అనుకున్నారు. అయితే సరదాగా శామ్ ఆ షాప్ ప్రారంభోత్సవానికి హాజరై రిబ్బన్ కట్ చేసిందని తెలిసింది.గతంలో మెట్రో సిటీలు.. నగరాల్లో ...అది కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వంటి వాటి రిబ్బన్ కటింగ్ లకే స్టార్ హీరోయిన్లను ఆహ్వానించేవారు. అయితే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న టౌన్ లలో....చిన్నషాపుల నిర్వాహకులు కూడా అప్ కమింగ్ - ఫేడ్ అవుట్ హీరోయిన్లతో ఓపెనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అయితే శామ్ వంటి స్టార్ హీరోయిన్.....ఓ చిన్న కేఫ్ ఓపెనింగ్ కు హాజరై రిబ్బన్ కట్ చేయడం పలువురిని ఆశ్చర్యపరిచింది. అయితే వెరైటీ గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ కేఫ్ ఓపెనింగ్ కు శామ్ అటెండయిందట. రొటీన్ కు భిన్నంగా సరదాగా ఆ కేఫ్ ఓపెనింగ్ కు వెళ్లి రిబ్బన్ కట్ చేసిందట. ఏది ఏమైనా...తనకున్న ఇమేజ్ ను పక్కన బెట్టి ఈ ఓపెనింగ్ కు శామ్ రావడం నిజంగా అభినందనీయం.