ఎన్టీఆర్: డ్రాప్ అయిన రీజన్ అదే!

Tue Dec 18 2018 17:49:11 GMT+0530 (IST)

తెలుగులో చాలామంది ఆర్ట్ డైరెక్టర్లు ఉన్నారు గానీ రామకృష్ణ-మోనికా జంట పేరు మాత్రం ఈమధ్య మార్మోగిపోతోంది.  ముఖ్యంగా 'రంగస్థలం' సినిమాకు వేసిన విలేజ్ సెట్ ఈ జంటకు భారీ గుర్తింపు తీసుకొచ్చింది.  దీంతో వారి ఖాతాలో క్రేజీ ఆఫర్లు వచ్చిపడ్డాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు మొదట ఈ జంటనే ఆర్ట్ డైరెక్టర్లుగా తీసుకున్నారట. కానీ మధ్యలో వారు సినిమానుండి తప్పుకున్నారు. మరి ఎందుకలా జరిగిందనే విషయాన్ని ఈమధ్యే వెల్లడించారు.  రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమాకు మొదట ఒప్పుకున్నామని.. రెండు సెట్లు కూడా డిజైన్ చేసినట్టు వెల్లడించారు.  'దాన వీర శూర కర్ణ' సీన్ లో సెట్ డిజైన్ చేసినది తామేనని చెప్పారు. కానీ తర్వాత షెడ్యూల్స్ మధ్య బ్రేక్ రావడం.. సినిమా ఆలస్యం కావడం.. దర్శకుడు మారడం లాంటి కారణాలతో తాము ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకున్నామని వెల్లడించారు.  తాము కమిట్ అయిన ఇతర సినిమాల షెడ్యూల్స్ తో క్లాష్ రావడం కూడా తప్పుకోవడానికి  మరో కారణమని చెప్పారు.  

ఇదిలా ఉంటే రామకృష్ణ - మోనిక జంట డిసెంబర్ 21 న విడుదల కానున్న 'అంతరిక్షం' సినిమాకు పనిచేశారు. స్పేస్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమాలో సెట్లకు చాలా ప్రాధాన్యత ఉంది.  మరి ఎన్టీఆర్ బయోపిక్ మిస్ అయినా 'అంతరిక్షం' సినిమాతో మరోసారి  తమ వర్క్ తో ప్రేక్షకులను మెప్పిస్తారేమో వేచి చూడాలి.