Begin typing your search above and press return to search.

చరణ్‌ బర్త్ డే కోసమేనా ఈ లేటంతా??

By:  Tupaki Desk   |   23 March 2017 10:41 AM GMT
చరణ్‌ బర్త్ డే కోసమేనా ఈ లేటంతా??
X
మెగా హీరో రామ్ చరణ్‌ ఇప్పటివరకు తన తదుపరి సినిమాను మొదలెట్టిందేలేదు. ధృవ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేశాడు.. తరువాత ఖైదీ నెం 150 విజయాన్ని ఒక ప్రొడ్యూసర్ గా ఆనందించాడు. అయితే తను హీరోగా మొదలవ్వాల్సిన సినిమాను మాత్రం ఇంకా మొదలుపెట్టట్లేదు. ఈ మధ్య కాలంలో ముహూర్తం కార్యక్రమం నిర్వహించి.. మార్చి 20 నుండి రెగ్యులర్ షూటింగ్ అన్నారు కాని.. అది కూడానూ ఇంకా జరగనేలేదు.

సుకుమార్ డైరక్షన్లో రామ్ చరణ్‌ తన తదుపరి సినిమాను చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఒక పల్లెటూరి యువకుడిగా అలరిస్తాడని టాక్. అయితే మార్చి 20వ తారీఖు నుండి షూటింగ్ అనుకుంటే.. ఇప్పుడు డేట్ మారిపోయింది. ఏప్రియల్ లో కాని షూటింగ్ స్టార్ట్ చేయరంట. అంటే దాదాపు ఒక నెల లేటుగా సినిమా మొదలవుతోంది. అవతల హీరోయిన్ సమంత డేట్లు కూడా రెడీగా ఉన్నా సరే మనోళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారబ్బా??

నిజానికి ఈ నెలలోనే.. మార్చి 27న రామ్ చరణ్‌ బర్త్ డే ఉంది. అందుకే ఇప్పుడు ఆ బర్త్ డే సెలబ్రేషన్లు ముగిశాకనే షూటింగులో పాల్గొనాలని చరణ్‌ ఫిక్సయ్యాడట. ఫారిన్ లొకేషన్లో తన వైఫ్‌ ఉపాసనతో కలసి సంబరాలు చేసుకుని.. ఆ తరువాత ఇక బ్రేక్ లెస్ బ్యాటింగ్ చేస్తాడని తెలుస్తోంది. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/