లోకులు కాకులు ఆంటీతో పూరికి పని ఏంటో?

Mon Feb 11 2019 13:02:25 GMT+0530 (IST)

ఈమద్య కాలంలో ఫేస్ బుక్ యూట్యూబ్ టిక్ టాక్ ఇలా ప్రతి సోషల్ మీడియా పోర్టల్ లో కూడా తెగ సందడి చేస్తున్న వ్యక్తి లోకులు కాకులు ఆంటీ. ఈమె అసలు పేరు జ్యోతి. ఈమె గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఆమె ఎవరు ఏంటీ అనే విషయంపై ఎన్నో కథనాలు వస్తున్న కారణంగా అసలు ఆమె పరిస్థితి ఏంటీ అనే విషయంపై క్లారిటీ రావడం లేదు. ఇలాంటి సమయంలో లోకులు కాకులు ఆంటీని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలవడం చర్చనీయాంశం అవుతుంది.తాజాగా తన ఆఫీస్ కు లోకులు కాకులు ఆంటీని పిలిపించుకుని మరీ పూరి మాట్లాడటం జరిగింది. ఆంటీని పూరి కలిసి నేపథ్యంలో మరోసారి ఆమె తెగ హడావుడి చేస్తోంది. ఇక పూరి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో ఈమెకు ఒక పాత్రను ఇచ్చే అవకాశం ఉందని పూరి ఇలాంటి ప్రయోగాలు అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాడు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ లో కూడా జ్యోతి ఆంటీని ఒక కామెడీ పాత్రకు తీసుకుంటాడేమో అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది కనుక ఆమెను పూరి కలిసి ఉండవచ్చు. అయితే సినిమా ఆఫర్ ఇచ్చాడనే విషయమై పూర్తిగా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం పూరి కెరీర్ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఇష్టం వచ్చినట్లుగా ప్రయోగాలు చేసేందుకు ధైర్యం చేయకపోవచ్చు. చిన్న పాత్రను ఈమెతో వేయిస్తే సినిమాకు క్రేజ్ పెరిగే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఈ విషయమై పూరి అండ్ కో నుండి అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి. రామ్ హీరగా రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.