Begin typing your search above and press return to search.

రాజమౌళి చిన్న సినిమా.. నాగ్ వద్దన్నాడా?

By:  Tupaki Desk   |   18 Jan 2018 1:53 PM GMT
రాజమౌళి చిన్న సినిమా.. నాగ్ వద్దన్నాడా?
X
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. తన ఇన్నేళ్ల కెరీర్ లో ఇంతవరకు ఫ్లాప్ అన్నది ఎరుగని జక్కన్నతో సినిమా చేయాలని అనుకోని హీరో ఉండడు. బాహుబలి తరవాత దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు రాజమౌళి ఏం చేసినా నేషనల్ వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాంటి దర్శక ధీరుడు ఓ సినిమా చేద్దామని అనుకున్నా కుదరలేదంటే కొంచెం విచిత్రమేనని చెప్పాలి.

ప్రస్తుతం రాజమౌళి తెలుగులోనే పెద్ద మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు హీరోలుగా చేసే ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా ఏడెనిమిది నెలల టైముంది. అప్పట్లో అక్కినేని హీరో అఖిల్ తో ఓ సినిమా తీస్తానని జక్కన్న అతడి తండ్రి నాగార్జునకు ఓ మాటిచ్చాడు. దీంతో ఈ టైం గ్యాప్ లో అఖిల్ తో ఓ చిన్న సినిమా తీద్దామని అనుకున్నాడట. కానీ జక్కన్న ఫోకస్ మల్టీస్టారర్ సినిమాపై ఉండటంతో అఖిల్ తో తీసే సినిమాపై పెట్టలేడేమోనన్న డౌట్ తో నాగ్ వద్దనేశాడని టాలీవుడ్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.

తన చిన్న కొడుకు అఖిల్ మొదటి సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో అతడి కెరీర్ ను పట్టాలెక్కించే బాధ్యతను అతడి తండ్రి నాగార్జున స్వయంగా తీసుకున్నాడు. అందుకే ఏరికోరి విక్రమ్ కె.కుమార్ ను ఒప్పించి హలో సినిమాను ప్లాన్ చేశాడు. ఈ సినిమా భారీ హిట్ కాకపోయినా అఖిల్ పడ్డ కష్టానికి తగ్గ గుర్తింపు వచ్చింది. ఇలాంటి టైంలో రాజమౌళి లాంటి డైరెక్టర్ ఆఫర్ కు నాగ్ నో చెప్పాడంటే జాగ్రత్త పడుతున్నట్టా.. సందేహ పడుతున్నట్టా..