Begin typing your search above and press return to search.

ఆ కృష్ణుడికి.. ఈ కృష్ణుడికి నాగ్ తేడా!

By:  Tupaki Desk   |   12 Oct 2017 5:49 AM GMT
ఆ కృష్ణుడికి.. ఈ కృష్ణుడికి నాగ్ తేడా!
X
అక్కినేని నాగార్జున గత కొన్ని వారాలుగా ఫుల్ బిజీ. రాజు గారి గది2 మూవీని ఫినిష్ చేయడం.. ఆ వెనకే ప్రమోషన్స్.. రీసెంట్ గా తన పెద్ద కొడుకు నాగచైతన్య వివాహం.. ఇప్పుడు హైద్రాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కోసం ఏర్పాట్లు.. ఇలా వరుసగా తన పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న నాగ్.. క్లీన్ షేవ్ తో కనిపిస్తూ జనాలకు షాక్ ఇచ్చేశారు.

ఎందుకిలా అనే ప్రశ్నకు సరదాగా ఏదో ప్రయోగం చేద్దామని అంటూ ఆయన సమాధానం ఇచ్చి మాట దాటవేశారు. కానీ ఇది ఇండస్ట్రీ జనాలకు అంతగా నమ్మబుద్ధేయలేదు. ఇందుకు కారణం.. నాగ్ ఎప్పుడూ ఇలా మీసం తీసేసి కనిపించడం జరగలేదు. గతంలో కృష్ణార్జున అంటూ విష్ణుతో కలిసి సినిమా చేసినపుడు కూడా.. కృష్ణుడిగా కనిపించడానికి నాగ్ ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. తన మీసంతోనే కృష్ణుడి పాత్రను చేశారు. అయితే.. ఇప్పుడు మీసం తీసేయడం వెనక కూడా ఓ కృష్ణుడి కథ ఉందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మలయాళంలో రాండమూఝం పేరుతో మహాభారతాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. భీముడి యాంగిల్ నుంచి ఉండే ఈ భారతంలో మొదట కర్ణుడి పాత్రను నాగ్ కు ఆఫర్ చేశారనే వార్తలు వచ్చాయి.

కానీ నాగార్జున మాత్రం కృష్ణుడి పాత్రపై మనసు పడ్డారట. అదే విషయాన్ని మేకర్స్ కు చెప్పారట. అందుకు సంబంధించిన లుక్స్ పై ప్రయోగాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వాదనకు బలం ఏంటంటే.. నాగార్జున తన కొడుకు వివాహం నాటికే మీసం పెంచి ఉండొచ్చు. కానీ ఆయన రోజు విడిచి రోజు మీసం.. గెడ్డం తీసేస్తూ క్లీన్ షేవ్ ను కంటిన్యూ చేస్తున్నారు. మొత్తానికి తెలుగు కృష్ణుడు చేయలేని పని.. మలయాళ కృష్ణుడు చేయగలిగాడన్న మాట.