Begin typing your search above and press return to search.

చైతు స్పీడ్ పెంచింది అందుకేనా..

By:  Tupaki Desk   |   22 March 2018 6:22 AM GMT
చైతు స్పీడ్ పెంచింది అందుకేనా..
X
అక్కినేని నాగచైతన్య ఇప్పుడు సినిమాలు చేయడం స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలు చేసేస్తున్నాడు. ప్రాజెక్టులు అంగీకరించడంలో కూడా వేగం చూపిస్తున్నాడు. గతంలో ఏడాదికి ఒకటి.. రెండేళ్లకు మూడు చొప్పున సినిమాలు చేసిన ఈ హీరో.. ఇప్పుడు ప్రతీ ఏటా మినిమం మూడు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

చైతు నటించిన సవ్యసాచి చిత్రం జూన్ లో రిలీజ్ కానుంది. అలాగే సెప్టెంబర్ లో మారుతి దర్శకత్వంలో రూపొందిన శైలజా రెడ్డి అల్లుడు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ లో రావడం ఖాయం అని చెప్పేస్తున్నారు. వీటితో పాటు పెళ్లి తర్వాత చైతు-సమంత జంటగా నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే ఏడాది వస్తుందట. నిన్నుకోరి దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనుంది. అలాగే వెంకటేష్ తో కలిసి బాబీ డైరెక్షన్ లో ఓ మల్టీస్టారర్ కూడా చేయబోతున్నాడు. వీటిలో న్యూకామర్స్ డైరెక్టర్లవే ఎక్కువగా ఉండడం విశేషం.

నిజానికి ఈ స్ట్రాటజీని గత మూడేళ్లుగా నాని అప్లై చేస్తున్నాడు. న్యూ ట్యాలెంట్ ను ప్రోత్సహించడం.. చకచకా సినిమాలు చేయడం.. తక్కువ బడ్జెట్ తో మూవీ కంప్లీట్ చేసి సాలిడ్ హిట్ కొట్టడం వంటివి చేస్తున్నాడు. ఇవే ఇప్పుడు నానిని స్టార్ హీరో రేంజ్ కు దగ్గర చేశాయి. మరోవైపు భారీగా ఆదాయం కూడా తెచ్చిపెట్టాయి. ఇప్పుడు చైతు కూడా ఇదే టెక్నిక్ ను అప్లై చేస్తూ.. చకచకా మూవీస్ చేయాలని డిసైడ్ అయ్యాడట.