Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో కంగన.. డబ్బు కోసమే!!

By:  Tupaki Desk   |   28 April 2016 3:30 PM GMT
ప్రభాస్ తో కంగన.. డబ్బు కోసమే!!
X
బాలీవుడ్ లో ఇప్పుడు బెస్ట్ ఫిమేల్ పెర్ఫామర్స్ లో కంగనా రనౌత్ పేరు టాప్ లో ఉంది. నేషనల్ బెస్ట్ అవార్డులు కూడా దక్కించుకుని ట్యాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అంతకంటే ఎక్కువగా హృతిక్ రోషన్ తో వివాదం విషయంలోనే జనాల నోళ్లలో నానుతోంది. ఈ భామ కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో ప్రభాస్ తో ఓ మూవీలో నటించింది. పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో ఏక్ నిరంజన్ మూవీలో కంగనా నటించింది.

ఈ మూవీలో కంగనా నటించడానికి వెనక గల కారణాన్ని.. ఆమె మాజీ లవర్ అధ్యయన్ సుమన్ బైటపెట్టేశాడు. జష్న్ మూవీలో అధ్యయన్ పెర్ఫామెన్స్ చూసి.. తండ్రి శేఖర్ సుమన్ ఉప్పొంగిపోయాడట. ఆ తర్వాత అధ్యయన్ బర్త్ డే నాడు.. బీఎండబ్ల్యూ7 సిరీస్ కార్ గిఫ్ట్ ఇచ్చాడట శేఖర్. ఈ కారును చూపించి కంగనను సర్ ప్రైజ్ చేద్దామని భావిస్తే.. 'నీకు కోటి రూపాయల కార్ గిఫ్ట్ ఇచ్చారా? జీవితంలో నువ్వేమంత సాధించావ్' అని అడిగిందట కంగన.

ఫ్యాషన్ సినిమాకి గాను నేషనల్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అందుకున్నా చేతిలో ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి ఆమెది. ఆ ఫ్రస్టేషన్ ను తాను అర్ధం చేసుకున్నా అంటున్నాడు అధ్యయనం. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే హైద్రాబాద్ వెళ్లానని, ఏక్ నిరంజన్ అనే తెలుగు సినిమాలో ప్రభాస్ సరసన నటించేందుకు ఒప్పుకున్నానని చెప్పిందట కంగనా. తిరిగి ముంబై వచ్చి.. అధ్యయన్ సుమన్ దగ్గర ఉన్న కార్ లాంటిదే కొనిందట కంగనా రనౌత్. అదీ కంగనా బీఎండబ్ల్యూ 7సిరీస్ కార్ వెనక ఉన్న స్టోరీ.

ఇలా సౌత్ లో సినిమాలను కేవలం భారీ పారితోషికం కోసం చేసే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కళ్లు తిరిగిపోయేంతటి రెమ్యూనరేషన్ ని.. రోజుల కాల్షీట్స్ కే ఇవ్వడంతోనే సౌత్ సినిమాలను చేస్తున్నారనే టాక్ ఉంది. అందులో కంగనా కూడా ఒకరు అంతే.