Begin typing your search above and press return to search.

కబాలి అందుకే చూడలేదన్న కమల్

By:  Tupaki Desk   |   25 July 2016 5:32 AM GMT
కబాలి అందుకే చూడలేదన్న కమల్
X
కమల్ హాసన్.. రజినీకాంత్ లు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఒకరికొకరు క్రియేటివ్ ఇన్ పుట్స్ ఇచ్చుకుంటారు ఈ సమకాలికులు. తన ప్రతీ సినిమాని రిలీజ్ కంటే ముందే స్పెషల్ షో వేసి మరీ కమల్ కి చూపించడం రజినీకి అలవాటు. కానీ కబాలి విషయంలో మాత్రం ఈ సెంటిమెంట్ మిస్ అయింది. రిలీజ్ కి ముందే కాదు.. ఇప్పటివరకూ కబాలి చూడలేదని చెప్పేశారు కమల్.

కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ కు యాక్సిడెంట్ అయింది. మెట్లపై నుంచి పడిపోవడంతో కాలికి ఫ్రాక్చర్స్ అయ్యాయి. దీంతో హాస్పిటల్ లో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు కమల్. 'ఈ యాక్సిడెంట్ టైమింగ్ నన్ను కబాలి చూసేందుకు అనుమతించలేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చూస్తాను' అని చెప్పారు ఈ విశ్వనటుడు. నెల రోజులకు పైగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్న కమల్.. ప్రస్తుతం రికవర్ అవుతున్నట్లు చెప్పారు. ఏళ్ల తర్వాత నెల రోజులకు పైగా హాలిడే దొరికిందని అన్నారాయన.

తనే డైరెక్షన్ చేస్తూ శభాష్ నాయుడు చిత్రాన్ని మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు కమల్ హాసన్. తను పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్ సస్పెండ్ లో పెట్టేసినట్లే అని.. అయితే శృతి హాసన్ డేట్స్ అడ్జస్ట్ చేస్తుందో లేదో.. తను బాగా బిజీ ఆర్టిస్ట్ కదా అంటూ కమల్ హాసన్ జోక్ చేశారు.