Begin typing your search above and press return to search.

​కాజల్ ప్రచారం కాసుల కోసమేనా?

By:  Tupaki Desk   |   11 Aug 2017 10:12 AM GMT
​కాజల్ ప్రచారం కాసుల కోసమేనా?
X
మన తెలుగు సినిమాలులో షూటింగ్ అయిపోయాక చాల మంది హీరోయిన్లు ఫిల్మ్ ప్రమోషన్లుకు రావడానికి ఇష్టపడరు. నయనతార లాంటి వాళ్ళయితే సినిమాలో నటించడంతో నా పని అయిపోయింది ఇక నేను వచ్చి ఏమి చెప్పాలి అని తప్పించుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడబోయే హీరోయిన్ నయనతార అంతా క్రేజ్ లేకపోయాన ఒక మోస్తరుగా ఉంది లెండి. కాజల్ అగర్వాల్ తన సినిమాలకు ప్రచారం చేయడానికి ఎప్పుడు మారాంచేయలేదు అనుకోండి. కానీ ఇప్పుడు విడుదలకాబోతున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా కోసం మాత్రం ముందు సినిమాల కన్నా ఎక్కువగానే ప్రచారం చేస్తుంది.

కాజల్ అగర్వాల్ కి ఇప్పుడు తెలుగులో పెద్ద సినిమాలు ఏవి చేతిలో లేవు. కాజల్ చేసిన కొన్ని పెద్ద సినిమాలకు కూడా ఏదో రావాలి కదా అనేలా వెళ్ళి ప్రమోషన్ ముగించుకొని వచ్చేది. కానీ నేనే రాజు నేనే మంత్రి సినిమా కోసం విరామం లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తూ టి‌వి స్టూడియోల చుట్టూ తిరుగుతూ కొన్ని కాలేజీ ఈవెంట్లకు కూడా వెళ్తూ సినిమా ప్రమోసన్స్ బాగానే చేసింది. కాజల్ ఎందుకు ఇంతలా ఈ సినిమా కోసం కష్టపడిపోయింది అని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే సురేశ్ బాబు ఈ సినిమా ప్రమోషన్ కోసం కాజల్ కు ఏకంగా 30 లక్షలు ఇచ్చాడని అంటున్నారు. సురేశ్ బాబు మార్కెటింగ్ చేయడంలో ఎలాంటి ఎత్తులు వేస్తాడో అందరికీ తెలిసిన సంగతే. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు సంపాదించుకోవడంలో సురేశ్ దిట్ట అనే చెప్పాలి. ఈ సినిమాకు కూడా కాజల్ చే ప్రచారం సినిమాకు ప్లస్ అయ్యింది అనే అంటున్నారు.

కాజల్ ఈ సినిమా ప్రమోషన్ కోసం డబ్బులు తీసుకుందా లేదో కానీ.. చేతిలో సినిమాలు ఏవి లేకపోయాన సమయంలో డైరెక్టర్ తేజ ప్రొడ్యూసర్ సురేశ్ బాబు కాజల్ ని హీరోయిన్ గా పెట్టుకోవడం ఇప్పుడు ఇలా ప్రచారం చేయించడం రానా సినిమాకి మంచి ప్లస్ అయ్యింది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతోనైనా కాజల్ అగర్వాల్ కి మరిన్ని పెద్ద తెలుగు సినిమా ఆఫర్లు వస్తాయేమో చూడాలి.​