Begin typing your search above and press return to search.

అటెండన్స్ వేయించుకుంటే అవకాశాలిస్తారా?

By:  Tupaki Desk   |   27 July 2017 7:06 AM GMT
అటెండన్స్ వేయించుకుంటే అవకాశాలిస్తారా?
X
మందు కొట్టట్లేదంటున్నారు. డ్రగ్స్ తీసుకోవట్లేదు అంటున్నారు. మరి లేట్ నైట్ పార్టీస్ లో చాలామంది హీరోయిన్లు ఏం చేస్తున్నారు? అసలు ఏ అలవాటూ లేనప్పుడు ఆ పార్టీల్లో వీరెందుకు ఉంటున్నారు? ఇదే ప్రశ్న ఇప్పుడు చాలామంది హీరోయిన్ల గురించి అడగాల్సి వస్తోంది. తాము పార్టీ బర్డ్స్ కాదని చెబుతున్న హీరోయిన్లు.. మరో ప్రక్కన చూస్తే పార్టీలోనే కనిపిస్తున్నారు. దీనికి హీరోయిన్లు చెబుతున్న ఒక కథ ఏంటంటే..

అసలు పార్టీలకు వెళ్లడం ఇష్టం లేకపోయినా కూడా.. అలా కనిపించకపోతే సదరు హీరోలు డైరక్టర్లూ ఈ హీరోయిన్లను మర్చిపోయే ఛాన్సుందట. రోజూ ట్విట్టర్లో ఫేస్ బుక్కులో పోస్టులు పెట్టేసి వార్తల్లో ఉండేదానికన్నా.. ఇలా పార్టీలకు వెళ్ళి ఆ హీరోలకు డైరక్టర్లకూ సన్నిహితంగా మెలిగితే అవకాశాలు వస్తాయని వీరి ఫీలింగట. నిజంగానే ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న కొందరు పెద్ద స్టార్ల పార్టీలను అక్కడకు వచ్చే వారిని చూస్తే.. ఈ హీరోయిన్లు చెప్పేది నిజమే అనిపిస్తుంది. కాకపోతే వారిచ్చే చాన్సులు వలన వీరేమన్నా పెద్ద పెద్ద స్టార్లు అయిపోయారా అంటే.. ఎవరో ఒకరి విషయంలో తప్పిస్తే అసలు అలాంటివి ఎప్పుడూ జరగట్లేదు. కాని మన భామలు మాత్రం ఆ పార్టీల్లో అటెండన్స్ వేయించుకునేది లిక్కర్ అండ్ డ్రగ్స్ కోసం కాదు.. కేవలం అవకాశాల కోసమే అనే చెబుతున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో నిజం ఏదైనా కూడా.. లేట్ నైట్ పార్టీస్ పై ఇప్పుడు ఎక్సయిజ్ డిపార్టమెంట్ నుండి పోలీస్ శాఖ వరకు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టేశారు. అలాగే మీడియా కూడా ఈ పార్టీలపై ఫోకస్ పెడుతోంది. ఇకమీదట ఇలాంటి పార్టీలకు అటెండ్ అవ్వాలంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. సర్లేండి భలే చెప్పారు.. అందుకేగా మనోళ్ళు పార్టీలను ఇండియాలో వదిలేసి బ్యాంకాక్ లో పెడుతున్నారు అనేవారూ లేకపోలేదు.