Begin typing your search above and press return to search.

RRR డ్రెస్ కోడ్ వెన‌క టాప్ సీక్రెట్‌!

By:  Tupaki Desk   |   14 March 2019 11:01 AM GMT
RRR డ్రెస్ కోడ్ వెన‌క టాప్ సీక్రెట్‌!
X
రామారావు-రాజ‌మౌళి-రామ్ చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ RRR గురించి స‌ర్వ వివ‌రాలు బ‌య‌టికి వ‌చ్చేశాయి. అస‌లు ఆర్.ఆర్.ఆర్ క‌థేంటి? హీరోల పాత్ర‌లేంటి? క‌థానాయిక‌లు ఎవ‌రు? రిలీజ్ తేదీ ఎప్పుడు? వ‌ంటి కీల‌క‌మైన స‌మాచారాన్ని ఎస్.ఎస్.రాజ‌మౌళి పూర్తిగా రివీల్ చేశారు. రాజ‌మౌళి కెరీర్ లోనే ఎప్పుడూ ఓ సినిమా సెట్స్ లో ఉండ‌గా ఇంత డీటెయిలింగ్ లేనేలేదు. కొమ‌రం భీమ్ - అల్లూరి సీతారామ‌రాజు లాంటి రియ‌ల్ వీరుల క‌థ‌లోకి ఫిక్ష‌న్ ని జొప్పించి క‌థ రాసుకున్నామ‌ని డీటెయిలింగ్ ఇచ్చేయ‌డంతో అభిమానులు హ‌ద్దే లేకుండా ఊహించుకుంటున్నారు.

నేడు హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో జ‌రిగిన ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ లో మ‌రో స‌ర్ ప్రైజ్ గురించి మీడియా జ‌నం ఆస‌క్తిగా మాట్లాడుకున్నారు. ఈ వేడుక‌లో రాజ‌మౌళి - రామ్ చ‌ర‌ణ్ - రామారావు త్ర‌యం పూర్తిగా వైట్ & బ్లాక్ కాంబినేష‌న్ డ్రెస్ ల‌లో క‌నిపించారు. ఆ ముగ్గురూ యూనిఫాం వేసుకున్న స్కూలు పిల్ల‌ల్లా తెల్ల చొక్కాయ్ - న‌ల్ల ఫ్యాంటు తొడుక్కుని క‌నిపిస్తే, ఆ ప‌క్క‌నే కూచున్న డీవీవీ దాన‌య్య పూర్తిగా బ్లాక్ & బ్లాక్ డ్రెస్ లో క‌నిపించి స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. అస‌లింత‌కీ ఈ డ్రెస్ కోడ్ మ‌ర్మ‌మేంటి? అంటూ మీడియాలో హాట్ డిబేట్ న‌డిచింది.

అయితే ఆ డ్రెస్ కోడ్ ని డీకోడ్ చేసేందుకు ఓ తూటా లాంటి ప్ర‌శ్న కూడా మీడియా నుంచి దూసుకెళ్లింది. ఇంత‌కీ ఆ యూనిఫాం ఎందుకు? నిర్మాత‌ దాన‌య్యనే ఎందుకు బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్ వేసుకున్నారు? అంటూ ప్ర‌శ్నించారు. అందుకు అట్నుంచి అదిరిపోయే స్మైల్ స‌మాధానం గా వినిపించింది త‌ప్ప ఆన్స‌ర్ లేదు. బ‌హుశా ఆన్ లొకేష‌న్ వీళ్లంతా షూటింగ్ అయిపోయాక ఒక డ్రెస్ కోడ్ మెయింటెయిన్ చేస్తూ ఉండొచ్చు. వంద‌లాది కార్మికుల మ‌ధ్య ప్ర‌ధాన ఆర్టిస్టులెవ‌రో అంద‌రూ గుర్తించాలి క‌దా? అస‌లే సెట్స్ లోనే కాపురం చేస్తున్న బ్యాచ్ ఇది. అందువ‌ల్ల క‌న్ఫ్యూజ‌న్ లేకుండా ఇలా ప్లాన్ చేశారా? ఏమో!! ఇక‌పోతే దాన‌య్య మాత్ర‌మే బ్లాక్ డ్రెస్ ఎందుకు వేశారు? అంటే బ్లాక్ మ‌నీ ఉన్న‌వాళ్లంతా ఇలా బ్లాక్ డ్రెస్ లోనే ఉంటారు క‌దా! అంటూ మీడియానే వేసిన సెటైర్ కి పార్క్ హ‌య‌త్ ప్రాంగ‌ణం ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేసింది. మొత్తానికి దాన‌య్య బ్లాక్ మ‌నీ బ‌య‌టికి తీసి ఇలా సినిమాల‌పై పెట్టుబ‌డులు పెడుతుంటే, ఇలా `తెల్ల` (డ్రెస్ తొడిగిన‌) దొర‌లంతా బ‌య‌ట‌ప‌డ్డార‌ని వేరొక కోణంలో అర్థం చేసుకోవ‌చ్చు!! అన్న‌ట్టు 350 -400 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్నామ‌ని అన్నారు. అదంతా బ్లాక్ మ‌నీ కాదు క‌దా?