మెగాస్టార్ లావుగా అయ్యింది ఇందుకేనా

Tue Jun 19 2018 17:10:50 GMT+0530 (IST)


టాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో సైరా ఒకటి. మెగాస్టార్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా స్పెషల్ కాబట్టి మెగాస్టార్ కూడా తన ఫిట్ నెస్ లో చాలా మార్పులు చేస్తున్నారు. గతంలో రామ్ చరణ్ సమక్షంలో జిమ్ వర్కౌట్స్ బాగానే చేశారు. అలాగే తన స్టైల్ లో కూడా కొన్ని మార్పులు చేసి సరికొత్తగా కనిపించడానికి ట్రై చేస్తున్నారు.అంతా బాగానే ఉంది కానీ ఈ మధ్య మెగాస్టార్ ఫిట్ నెస్ పై ఓ లుక్కిస్తే ఇలా అయ్యారేంటి అని అనకుండా ఉండలేరు. కొంచెం ఉబ్బిన చెంపలతో బొద్దుగా అనిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇలా ఎందుకు దర్శనమిచ్చారు అంటే... అందుకు సైరా కారణమని తెలిసింది. సైరా నరసింహ రెడ్డి పాత్రలో మెగాస్టార్ విభిన్న శైలి గల క్యారెక్టర్స తో కనిపిస్తారని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల కోసం కొంచెం లావుగా కనిపించాలి కాబట్టి వెయిట్ పెరగక తప్పలేదట. ప్రస్తుతం అందుకు సంబందించిన స్నానివేశాలను కోకాపేట లోని ఒక భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమా మొదలుపెట్టి 6 నెలలు పూర్తి కావొస్తోంది. అయినా కూడా సినిమా సగం కూడా పూర్తవ్వలేదు. కేవలం 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయ్యిందట. దర్శకుడు సురేందర్ రెడ్డి సంక్రాంతి లోపు సినిమా షూటింగ్ ఫినిష్ చేసి అప్పుడే రిలీజ్ చెయ్యాలని అనుకున్నాడు. కానీ అది అయ్యే పనిలా కనిపించడం లేదు. ఇక సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గ్రెగ్ పావెల్ ను సురేందర్ సెట్ చేసుకున్నాడు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6 - హ్యారీ పోటర్  సిరీస్ అలాగే స్కైఫాల్ లాంటి సినిమాలకు పోవెల్ పనిచేశాడు.