Begin typing your search above and press return to search.

మెగాస్టార్ సైలైన్స్.. సీక్రెట్ ఇదేనా?

By:  Tupaki Desk   |   24 Aug 2017 6:23 AM GMT
మెగాస్టార్ సైలైన్స్.. సీక్రెట్ ఇదేనా?
X
టాలీవుడ్ మెగాస్టార్.. బాలీవుడ్ మెగాస్టార్ కలిసి నటించబోతున్నారనే విషయాన్ని.. ''సై రా నరసింహారెడ్డి'' మేకర్స్ అఫీషియల్ గానే ప్రకటించారు. అమితాబ్ తెలుగు సినిమాలో పూర్తి స్థాయి రోల్ చేయడం.. అది కూడా చిరంజీవి సినిమాలో కావడం చాలా చాలా పెద్ద విషయమే. అయితే.. తన సినిమాల విషయంలో ట్విట్టర్లో రెగ్యులర్ అప్ డేట్స్ ఇచ్చే బిగ్ బీ.. చిరు సినిమా విషయంలో మాత్రం సైలెంట్ గానే ఉండడం చాలా రకాల అనుమానాలకు రూమర్లకు ఛాన్సిస్తోంది.

టాలీవుడ్ లో వినిపిస్తున్న ఓ టాక్ ప్రకారం.. రామ్ చరణ్ అండ్ టీం తమ వ్యూహంలో భాగంగానే ఇలా సైలెన్స్ పాటిస్తున్నారట. ఓ సినిమా విషయంలో ఏ వివరాలు బైటకు రాకుండా.. ఎంతగా సీక్రెసీ పాటిస్తే అంతగా పబ్లిసిటీ పొందచ్చనే విషయాన్ని రాజమౌళి ఇప్పటికే ప్రూవ్ చేసేశాడు. బాహుబలి యాక్టర్స్ కూడా ఆ సినిమా గురించి అడపాదడపా మినహాయిస్తే.. మాట్లాడేసిన సందర్భాలు అరుదు. ఇప్పుడు చిరు అండ్ కో కూడా ఇదే సూత్రం ఫాలో అవుతున్నారట. సినిమాకి సంబంధించి ఎవరైనా పెద్ద స్టార్ ని.. యాక్టర్ ని బోర్డ్ లోకి తీసుకుంటే.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ మినహాయిస్తే.. మిగిలిన ఏ వివరాలను ఏ నటుడు/నటి బైటకు అనౌన్స్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.

అఫ్ కోర్స్.. తాను సై రా చిత్రంలో నటిస్తున్నానంటూ చెప్పే అవకాశం ఉన్నా.. బిగ్ బీ విషయంలో మాత్రం కావాలనే ఇలా సైలెన్స్ పాటించేలా చేస్తున్నారట. ఆలోచిస్తే అదీ నిజమేగా అనిపించక మానదు. ఎందుకంటే.. అమితాబ్ రియాక్ట్ అయితే.. ఈ పాటికే ఈ టాపిక్ చల్లారేది. కానీ ఇప్పుడు అమితాబ్ నుంచి స్పందన వచ్చే వరకూ ఇది హాట్ టాపిక్కే కదా. ఇక సై రా నరసింహారెడ్డి సినిమాలో.. మెగాస్టార్ కు గురువు పాత్రలో.. బ్రిటిషర్ల పన్నాగాల గురించి నూరిపోసే రోల్ లో అమితాబ్ నటించనున్నారని టాక్.