Begin typing your search above and press return to search.

బన్నీ పెట్టుకునే పేర్ల వెనుక చాలా ఉంది

By:  Tupaki Desk   |   29 Aug 2016 5:30 PM GMT
బన్నీ పెట్టుకునే పేర్ల వెనుక చాలా ఉంది
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభమైపోయింది. ముందుగా అనుకున్నట్లుగానే హరీష్ శంకర్ డైరెక్షన్ లోనే సినిమా స్టార్ట్ చేసేస్తున్నాడు బన్నీ. ఈ మధ్య కాలంలో ఎప్పటికో టైటిల్ ని ఫిక్స్ చేసే ట్రెండ్ కి భిన్నంగా.. ముందుగానే టైటిల్ ని ప్రకటించేసి మరీ సినిమా స్టార్ట్ చేస్తున్నారంటే.. బన్నీ- హరీష్ శంకర్ లు ఏ రేంజ్ స్పీడ్ లో ఉన్నారో అర్ధమవుతుంది. ఆల్రెడీ ఈ సినిమా ముహూర్తం కూడా కొట్టేసి.. ఏప్రిల్ 2017 మొదటి వారంలో రిలీజ్ అని కూడా ప్రకటించేశారు.

డీజే- దువ్వాడ జగన్నాధం.. ఇదీ బన్నీ లేటెస్ట్ మూవీ నేమ్. సినిమాలో అల్లు అర్జున్ పాత్ర పేరు ఇదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ ని తన పాత్రకు సెట్ చేయడంలో బన్నీ ఆరితేరిపోయాడు. జులాయిలో అల్లు అర్జున్ పాత్ర పేరు రవీంద్ర నారాయణ్. ఇద్దరమ్మాయిలతో మూవీలో సంజు రెడ్డి. రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి. రేసుగుర్రంలో అల్లు లక్ష్మణ్ ప్రసాద్.. అలియాస్ లక్కీ. సన్నాఫ్ సత్యమూర్తిలో విరాజ్ ఆనంద్ అనే పాత్రను పోషించాడు అల్లు అర్జున్. కాకపోతే సరైనోడులో మాత్రం గణ అంటూ సింపుల్ గా పెట్టేసుకన్నాడు. ఇప్పుడు దువ్వాడ జగన్నాథంగా ప్రేక్షకుల ముందుకు వస్తానంటున్నాడు.

ఈ పేర్లన్నీ డిఫరెంట్ సౌండింగ్ తో ఉండేవే అని అర్ధమవుతూనే ఉంది. అయితే ఈ పేరులన్నీ వింటుంటే ఒక్క విషయం వెంటనే మనకు తడుతుంది. ఒక్కో ఇంటిపేరూ ఒక్కో కులం పేరులా లేదూ? ఔనన్నా కాదన్నా అలాగే ఉంది. పేరు వింటే చాలు క్యాస్ట్ ఏంటనేది చెప్పేసేయొచ్చు. ఆ లెక్కన చూస్తే అన్ని సామాజిక వర్గాలను సినిమాలతో కవర్ చేసేస్తున్నాడు బన్నీ అనుకోవాల్సిందే మరి. బన్నీ పేర్ల వెనుక ఈ మాత్రం కథ లేదంటారా?