Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: మాస్ మాస్.. ఊర మాస్

By:  Tupaki Desk   |   3 May 2016 9:08 AM GMT
టీజర్ టాక్: మాస్ మాస్.. ఊర మాస్
X
ఆ మధ్య ఫస్ట్ లుక్ పోస్టర్లు చూసినపుడే అర్థమైంది.. ‘రాయుడు’ పక్కా మాస్ సినిమా అని. ఐతే ఇప్పుడు టీజర్ చూశాక ఇది మాస్ కాదు ఊర మాస్ సినిమా అనిపిస్తోంది. అచ్చమైన అరవ మాస్ సినిమా తరహాలోనే తెరకెక్కినట్లుంది ‘రాయుడు’. దీని టీజర్ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాప్ హీరోయిన్లు శ్రుతి హాసన్.. తమన్నా.. రకుల్ ప్రీత్ సింగ్ కలిసి ఈ టీజర్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం విశేషం. పొడవాటి నిక్కరు.. దాని మీదికి ఎగ్గట్టిన లుంగీ.. పైగా కలర్ బనియన్.. ఒంటి మీద పచ్చబొట్టు.. కండలు తిరిగిన బాడీ.. నోట్లో కత్తి.. ఇలా అచ్చమైన అరవ మాస్ హీరో ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడిందులో విశాల్.

‘‘రేయ్ కొట్టడంలో మూడు రకాలున్నాయి. ఒకటి మాట్లాడకముందు మాట్లాడక ముందు కొట్టడం.. రెండు మాట్లాడుతుంటే కొట్టడం.. మూడు మాట్లాడనిచ్చి కొట్టడం.. ఈ రాయుడు మొదటి రకం. మాట్లాడకముందే కొడతాడు’’ అంటూ ఊర మాస్ డైలాగ్ ఒకటి చెప్పాడు విశాల్. ఆ తర్వాత ‘‘మా రాయుడు బలంలో సింహం.. గుణంలో పులి’’ అంటూ ఇంకో డైలాగ్ కూడా వినిపించారు టీజర్లో. కార్తితో ‘కొంబన్’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విశాల్.. మరో నిర్మాతతో కలిసి నిర్మించాడు. తెలుగులో హరి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. విశాల్ సరసన తెలుగమ్మాయే అయిన శ్రీదివ్య కథానాయికగా నటించింది. ఈ నెల 20న తమిళ-తెలుగు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.