Begin typing your search above and press return to search.

రవితేజకు అంత ఫిజిక్ అంటే కష్టమేగా?

By:  Tupaki Desk   |   23 July 2016 5:30 PM GMT
రవితేజకు అంత ఫిజిక్ అంటే కష్టమేగా?
X
ఒక సినిమా తెలుగులో హిట్టయ్యిందంటే.. ఆ సినిమాను వెంటనే హిందీలో తీయడానికి రెడీగా ఉండేవాడు సల్మాన్ ఖాన్‌. కాని ఇప్పుడు సీన్ మారింది. మనోడు సొంతంగా చాలామంది కథలు వెతుక్కుంటున్నాడు. మొన్న బజరంగీ భాయిజాన్.. ఇప్పుడు సుల్తాన్‌ అందుకు ఉదాహరణలు. అందుకే ఈ రెండు సినిమాలను వేరే బాషలో రీమేక్ చేయాలని చాలామంది చూస్తున్నారు.

అయితే సల్మాన్ సుల్తాన్‌ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఓ ఇద్దరు హీరోలు తెగ ఆశ పడుతున్నారట. వారిద్దరిలో మొదటి పేరు రవితేజ అయితే.. రెండవది విక్టరీ వెంకటేష్. ఆల్రెడీ సాలా కడ్డూస్ అనే బాక్సింగ్ సినిమాపై వెంకీ కన్నేశాడు కాబట్టి.. ఇప్పుడు మళ్ళీ అదే తరహా స్పోర్ట్స్ డ్రామా అయిన సుల్తాన్‌ చేస్తాడా? అందుకే రవితేజ ఈ సినిమా హక్కుల గురించి మాట్లాడమని తన సన్నిహితులతో చెప్పాడట. బాగానే ఉంది కాని.. ఇప్పటికిప్పుడు ఒక వ్రెజ్లర్ గా కనిపించడానికి కావల్సినంత ఫిజిక్ మాస్ రాజా దగ్గర లేదు. ఏదో కాస్త వెయిట్ పెంచి సిక్స్ ప్యాక్ చేశాడనే రూమర్లు వచ్చాయి కాని.. సిక్స్ ప్యాక్ లుక్ ఉన్నంత మాత్రాన కుస్తీవీరుడిగా సెట్టవ్వడం కష్టమే.

ఇకపోతే సుల్తాన్ కుస్తీలేమో కాని.. ఒక నిజ జీవితపు కుస్తీ పర్సనాలిటీ అయిన కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా రానా దగ్గుబాటి ఒక సినిమా చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే.