Begin typing your search above and press return to search.

చిరుని కాదని కమల్ తో కమిటయ్యాడు

By:  Tupaki Desk   |   21 Oct 2017 9:30 AM GMT
చిరుని కాదని కమల్ తో కమిటయ్యాడు
X
ఒక సినిమా మొదలు పెడితే అనుకున్న టైమ్ కి పూర్తవుతుందా అని ఏ చిత్ర దర్శకుడు నమ్మకంగా చెప్పలేడు. అలాగే ఆ సినిమా షూటింగ్ ప్రయాణాల్లో కొందరు మధ్యలోనే తప్పుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ చాలా కామన్. అయితే భారీ చిత్రాల విషయంలో మాత్రం ఇలాంటి పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకోవు కానీ ఇటీవల మెగాస్టార్ సినిమాకి అవకాశం దక్కించుకున్న సినిమాటోగ్రాఫర్ మాత్రం సినిమా నుంచి తప్పుకున్నాడు.

అయితే వెంటనే అతను మరొక పెద్ద సినిమాకు అవకాశం దక్కించుకున్నాడు. కోలీవుడ్ లో దశావతారం - 7th సెన్స్ సినిమాలకు అద్భుతమైన కెమెరా పనితనాన్ని చూపించిన రవి వర్మన్ బాలీవుడ్ లో జగ్గా జాసూస్ అలాగే టాలీవుడ్ లో బద్రినాథ్ సినిమాకు కూడా వర్క్ చేశాడు. అయితే చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహ రెడ్డి సినిమాకు ఛాన్స్ దక్కించుకున్న ఆయన చిత్ర యూనిట్ తో క్రియేటివ్ విషయంలో విభేదాలు రావడంతో తప్పుకున్నారట. డేట్లు సర్దుబాటు చేయలేకనే తప్పుకున్నారని ఇంకొందరు అంటున్నారులే.

రవి వర్మన్ శంకర్ - కమల్ హాసన్ కలయికలో వస్తోన్న భారతీయుడు 2 సినిమాకు అవకాశం దక్కించుకున్నారు. శంకర్ తో ఇంతకుముందు అపరిచితుడు సినిమాకు వర్క్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయనతో కలవబోతున్నారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.