Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ల కోసం ట్రై చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   15 Dec 2017 5:54 AM GMT
ఆ హీరోయిన్ల కోసం ట్రై చేస్తున్నాడా?
X
మాస్ మహరాజా నెక్ట్స్ మూవీ ఖాయమైపోయింది. రాజా ది గ్రేట్ తో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టి.. బ్యాంగ్ బ్యాంగ్ రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ.. అప్పటి నుంచి కొత్త సినిమాను ప్రకటించలేదు. కళ్యాణ్ కృష్ణతో సినిమా ప్రస్తావన ఉన్నా.. అధికారికంగా వెల్లడించలేదు. అంత పెద్ద హిట్ కొట్టిన రెండు నెలలకు కూడా కొత్త సినిమాపై ప్రకటన చేయడం ఆశ్చర్యమే.

అయితే.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు. మొదట ఈ సినిమాలో కొత్త హీరోయిన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు జనాలకు తెలిసిన అమ్మాయినే తీస్కోవాలని భావిస్తున్నారట. రవితేజ దృష్టి రకుల్ ప్రీత్ సింగ్ పై ఉందని.. ఇప్పటికే ఆఫర్ ను పంపారని తెలుస్తోంది. అయితే.. రకుల్ సైడ్ నుంచి పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ లేదని అంటున్నారు. పాటల్లో డ్యాన్సుల వరకే పరిమితం అయ్యే క్యారక్టర్లు చేస్తే.. సడెన్ గా ఎలాంటి ఫాల్ ను చూడాల్సి వస్తుందో రీసెంట్ గానే అర్ధమైంది రకుల్ కి.

అందుకే రవితేజతో ఫ్రెండ్ షిప్ ఉన్నా.. సినిమాకు మాత్రం సై అనడం లేదట రకుల్ ప్రీత్ సింగ్. అయితే.. గ్లామర్ విషయంలో కాసింత లిబరల్ గా ఉండే అమ్మాయి కోసం వెదుకుతున్న రవితేజ- కళ్యాణ్ కృష్ణ.. ప్రస్తుతం తమన్నాను తీసుకునేందుకు ట్రై చేస్తున్నారని తెలుస్తోంది.