Begin typing your search above and press return to search.

వాట్ రవితేజకు ఆ ఆలోచన ఉందా?

By:  Tupaki Desk   |   14 March 2019 4:44 AM GMT
వాట్ రవితేజకు ఆ ఆలోచన ఉందా?
X
ఏమో గుర్రం ఎగరావచ్చు తరహాలో సినిమా పరిశ్రమలో ఏ నిమిషంలో ఎలాంటి మార్పులు ఉంటాయో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఊహించడం కష్టం. మాస్ రాజాగా తనకంటూ బలమైన మార్కెట్ ని ఫాలోయింగ్ ని ఏర్పర్చుకున్న రవితేజ త్వరలో దర్శకత్వం చేసే ఆలోచనలో ఉన్నట్టు ఫిలిం నగర్ గాసిప్. ఏదో గాలి వార్త అనుకోవడానికి లేకుండా హీరో పేరు కూడా బయటికి వస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఓ కథను రవి ఇటీవలే వినిపించాడని బాగా ఇంప్రెస్ అయిన కళ్యాణ్ తన బ్యానర్ మీదే చేసేందుకు ఆసక్తి చూపించాడని వాటి సారాంశం.

గతంలో కిక్ 2 నిర్మించిన సమయంలో కళ్యాణ్ రామ్ కు రవితేజకు మంచి రాపో కుదిరింది. సినిమా పోయింది కానీ ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఆ చనువుతోనే రవితేజ లైన్ వినిపించాడని సమాచారం. ఈ నిర్ణయం తన మార్కెట్ కొంత బలహీనపడినందుకు తీసుకున్నాడా లేక జస్ట్ ఫర్ ఆ చేంజ్ తరహాలో ఆలోచించాడా లాంటి వివరాలేం తెలియవు.

గతంలో హీరోలు దర్శకులుగా మారి చరిత్రలో నిలిచిపోయే విజయాలు సాధించిన ఉదంతాలు ఉన్నాయి. మంచి ఉదాహరణగా ఎన్టీఆర్ కృష్ణలను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు తాము హీరోగా నటించిన సినిమాలనే డైరెక్ట్ చేసుకున్నారు తప్పించి ఇంకొకరితో ప్రయోగం చేయలేదు. ఇప్పుడీ వార్త నిజమైతే కనక రవితేజ ఈ విషయంలో కొంత ప్రత్యేకంగా నిలుస్తాడు. చూడాలి నిజంగా రవితేజ డైరెక్టర్ కుర్చీలో కూర్చోబోతున్నాడా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లో తేలిపోవచ్చు