Begin typing your search above and press return to search.

ర‌వితేజ ఇంటి నుంచి స్టార్ట్ కార‌ట‌

By:  Tupaki Desk   |   27 July 2017 7:24 AM GMT
ర‌వితేజ ఇంటి నుంచి స్టార్ట్ కార‌ట‌
X
డ్ర‌గ్స్ విచార‌ణ‌లో భాగంగా నోటీసులు అందుకున్న టాలీవుడ్ ప్ర‌ముఖుల్లో హీరో ర‌వితేజ ఒక‌రు. ఇప్ప‌టికే ఎనిమిది మంది సినీ ప్ర‌ముఖుల్ని విచారించిన సిట్ అధికారులు (ఈ రోజు ముమైత్ ను క‌లుపుకొని) రేపు (శుక్ర‌వారం) హీరో ర‌వితేజ‌ను విచారించ‌నున్నారు. ప్ర‌స్తుతం రాజా ది గ్రేట్‌.. ట‌చ్ చేసి చూడు చిత్రాల్లో న‌టిస్తున్న ర‌వితేజ‌.. షూటింగ్ లో భాగంగా అవుట్ స్టేష‌న్ లో ఉన్నారు.

తాజాగా ఆయ‌న హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. సిట్ విచార‌ణ కోసం ర‌వితేజ‌.. శుక్ర‌వారం ఉద‌యం ఇంటి నుంచి కాకుండా మ‌రో ప్ర‌దేశం నుంచి స్టార్ట్ కావాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. మీడియా తాకిడి ఎక్కువ‌గా ఉన్న వేళ‌.. ఉద‌యాన్నే ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌ని ర‌వితేజ నిర్ణ‌యించుకున్న‌ట్లుగా స‌మాచారం.

పొద్దున్నే బ‌య‌ట‌కు వెళ్లి.. విచార‌ణ కోసం పేర్కొన్న స‌మ‌యానికి సిట్ కార్యాల‌యానికి చేరుకునేలా ర‌వితేజ ప్లాన్ చ‌సిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. త‌న కుమారుడికి డ్ర‌గ్స్ తో ఏ మాత్రం సంబంధం లేద‌ని ర‌వితేజ త‌ల్లి రాజ్య‌ల‌క్ష్మి ఇప్ప‌టికే స్ప‌ష్టం చేయ‌టం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ సిట్ విచార‌ణ‌కు హాజ‌రైన వారిలో ఎక్కువ మంది ధ‌రించిన వైట్ ష‌ర్ట్ నే ర‌వితేజ కూడా ఎంచుకుంటారా? అందుకు భిన్నంగా వ‌స్తారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.